BigTV English

Game Changer : సినిమా తీస్తున్నాడా? వెబ్ సీరిసా? పాపం నిర్మాత… చుక్కలు చూపిస్తున్న డైరెక్టర్

Game Changer : సినిమా తీస్తున్నాడా? వెబ్ సీరిసా? పాపం నిర్మాత… చుక్కలు చూపిస్తున్న డైరెక్టర్

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏ ముహూర్తాన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాను ఒప్పుకున్నాడో తెలియదు గానీ ఈ సినిమా విషయంలో మొదటి నుంచి తేడా కొడుతూనే ఉంది. ఇక తాజాగా వినిపిస్తున్న టాక్ తెలిస్తే మెగా అభిమానులు ఏడవడం ఒక్కటే తక్కువేమో. నిర్మాతకైతే డైరెక్టర్ ఒక్కో విషయంలో ఒక్కో రకంగా టార్చర్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ఫుటేజ్ నిర్మాత కళ్ళల్లో నీళ్లు తిరిగే రేంజ్ లో ఉందట.


డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ట్రిపులార్ సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో కియారా అద్వానీ రెండోసారి రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటిదాకా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చిన విషయం తెలిసిందే. మూవీని స్టార్ట్ చేసి దాదాపు మూడేళ్లు గడుస్తోంది. కానీ ఇంకా ఈ మూవీ షూటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టలేదు డైరెక్టర్ శంకర్.

ఇటీవలే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ నుంచి ఓ పాటను రిలీజ్ చేయడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఆ పాటకు పెట్టిన బడ్జెట్ చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. ఆ ఒక్క పాట కోసమే ఏకంగా 20 కోట్లకు పైగా ఖర్చు పెట్టారట శంకర్. ఇదిలా ఉంటే మరోవైపు సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ ఉండడంతో నిర్మాతపై రోజు రోజుకు భారం పెరుగుతోంది. రీసెంట్ గా సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.


అసలు విషయం ఏమిటంటే సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇంకా 10 రోజులు మిగిలి ఉన్నప్పటికీ దాదాపు 6 గంటల ఫుటేజీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది నిజంగా నిర్మాతకు కన్నీళ్లు తెప్పించే విషయమే. అయితే ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు డైరెక్టర్ శంకర్ పై విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే శంకర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాను పక్కన పెట్టి ‘భారతీయుడు 2’ సినిమాపై ఫోకస్ పెట్టారు. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాను తను లేకుండానే డీల్ చేయడానికి శైలేష్ కొలను వంటి డైరెక్టర్ ను పెట్టాడు. ఆయనేమో తాను జస్ట్ ప్యాచ్ వర్క్ చేశానని కవర్ చేసినప్పటికీ అది సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందని టెన్షన్ మెగా అభిమానుల్లో ఇప్పటికీ ఉంది.

కానీ ఇప్పుడేమో ఇంకా పది రోజులు షూటింగ్ పెండింగ్ పెట్టుకొని 6 గంటల ఫుటేజీ వచ్చిందని వార్తతో మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘చెర్రీ మూవీని పక్కన పడేసి ‘ఇండియన్ 2′ సెట్ లో కూర్చుంటే 6 గంటలు కాకపోతే 60 గంటలు సినిమా వస్తుంది… అది సినిమా అనుకుంటున్నాడా లేక వెబ్ సిరీస్ అనుకుంటున్నారా’ అంటూ శంకర్ పై విరుచుకు పడుతున్నారు. ‘ఇండియన్ 2’ మూవీ డిజాస్టర్ అయ్యాక శంకర్ పూర్తిగా రామ్ చరణ్ ని రీషుట్ పేరుతో మళ్లీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడని టాక్ నడిచింది.

కానీ చెర్రీ దానికి ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో నిర్మాత దిల్ రాజు (Dil Raju) పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిందని ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ సర్దుకుని ముందుకు వెళ్తుంటే డైరెక్టర్ రోజుకో  సమస్యతో నిర్మాత నెత్తినెక్కి కూర్చుంటున్నాడని అంటున్నారు. చెర్రీ అయితే తన పార్ట్ షూటింగ్ అయిపోగొట్టుకొని ఎలాగోలా బయటపడ్డాడు. కానీ సినిమా రిలీజ్ అయ్యేదాకా నిర్మాతకు ఈ తంటాలు తప్పవు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×