Lab Sharath:ల్యాబ్ శరత్ .. ప్రసాద్ ల్యాబ్‌లో చీఫ్ టెక్నీషియన్‌గా పనిచేసిన ఈయన ఇప్పుడు నటుడిగా ఫుల్ బిజీ గా అయిపోయారు అలాంటి ఈయన తాజాగా .బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి ఇప్పుడు సినిమాల్లో తండ్రి పాత్రలకున్న ఇంపార్టెన్స్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.
ప్రసాద్ ల్యాబ్‌తో మొదలైన అనుబంధం..
తనకి సినిమా పరిశ్రమతో పరిచయం నటుడిగా మారిన తర్వాత మొదలైంది కాదని, ఆయన ప్రసాద్ ల్యాబ్‌లో పనిచేసినప్పటి నుంచే ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, కెమెరామెన్లు, నటీనటులతో మంచి అనుబంధం ఏర్పడిందని తెలిపారు. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు ప్రభాస్‌తోనూ పరిచయం ఉందని చెప్పారు. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు స్టార్ హీరోల పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని మాట్లాడేంత చనువు తనకు ఉండేదని తెలిపారు.
అందువల్లే ఇతర ఫాదర్ క్యారెక్టర్లు చేసే నటులతో పోలిస్తే తనకు కాస్త ఎక్కువ గుర్తింపు ఉండేదని చెప్పారు. దర్శకులు, నిర్మాతలు కనిపించినప్పుడు ఆప్యాయంగా పలకరించేవారని, రాఘవేంద్రరావు వంటి దర్శకులు కూడా ఫంక్షన్లలో కనిపిస్తే సినిమాల్లోనే కనిపిస్తున్నావా అంటూ సరదాగా మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. ఇక మోహన్ బాబుతో కూడా తనకు మంచి పరిచయం ఉందని తెలిపారు.
అప్పటి తండ్రి పాత్రలకు.. ఇప్పటి పాత్రలకు చాలా తేడా!
ఇక సినిమాల్లో ఫాదర్ రోల్స్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, కోట శ్రీనివాసరావు వంటి నటులు చేసిన తండ్రి పాత్రలకు కథలో చాలా ప్రాధాన్యత ఉండేదని,హీరోయిన్ తండ్రి పాత్ర అంటే కేవలం రెండు మూడు డైలాగులకు పరిమితం కాకుండా, కథలో కీలకమైన ఉండేవారని వివరించారు.
అప్పట్లో కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ నటులు కూడా తనతో మాట్లాడుతూ హీరోయిన్ తండ్రి పాత్రలకు తాను బాగా సరిపోతానని, నటనలో మరింత ప్రయత్నించాలని ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం తండ్రి పాత్రల తీరు మారిపోయిందని వాపోయారు.
ఇప్పుడు హీరోయిన్ తండ్రి పాత్రల్లో ఎక్కువగా కూతురితో మాట్లాడటం, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు చెప్పడం, ఆలస్యంగా వస్తే ప్రశ్నించడం వంటి సీన్స్ కే పరిమితమవుతున్నాయని మనసులోని మాటని బయట పెట్టారు..
బాలకృష్ణ గురించి శరత్ చెప్పిన ఆసక్తికర విషయాలు!
ఇక నందమూరి బాలకృష్ణతో తనకు మంచి అనుబంధం ఉందని బాలకృష్ణ సెట్‌లో చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు అనే తేడా లేకుండా అందరితోనూ సమానంగా ఉంటారని చెప్పారు. షూటింగ్‌లో షాట్ పూర్తయిన తర్వాత కూడా అందరినీ కూర్చోబెట్టుకుని సరదాగా మాట్లాడుతుంటారని, వచ్చినప్పుడు అందరినీ పలకరిస్తారని, వెళ్లేటప్పుడు కూడా చెప్పి వెళ్తారని వివరించారు.
ఇక బాలకృష్ణకు భారతం, రామాయణం వంటి విషయాలపై మంచి అవగాహన ఉందని, పద్యాలు కూడా చెప్పించుకుంటూ ఉంటారని తెలిపారు. ఆయనలో తనకు బాగా నచ్చే లక్షణం అందరినీ సమానంగా చూడటమేనని చెప్పారు.
మేకప్‌కు రెండు గంటలు.. అయినా సమయానికి
బాలకృష్ణతో కలిసి పనిచేసిన సినిమాల షూటింగ్ అనుభవాలను కూడా పంచుకున్నారు. ముఖ్యంగా ‘అఖండ’ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ చూపించిన క్రమశిక్షణ తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు.
ఆ సినిమాలో గడ్డం, విగ్గు, ప్రత్యేకమైన మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదని,అందుకే బాలయ్య అంత ప్రొద్దున లేస్తారని తెలిపారు. ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉంటే 6:45 గంటలకే బాలకృష్ణ సిద్ధంగా ఉండేవారని ఎండ బాగా ఉన్నప్పటికీ లెక్క చేసేవాడు కాదని దర్శకుడు చెప్పిన సమయానికి షూటింగ్‌కు వచ్చేవారని అన్నారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు సీన్ తీసేది ఉంటె అంతకంటే ముందుగానే సిద్ధంగా ఉండేవారని, బూడిదతో కూడిన అఖండ గెటప్‌ను సాయంత్రం వరకు తీసేవారు కాదని బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని వివరించారు శరత్ .
ALSO READ:500 సినిమాలు చేశా.. కానీ నా పేరు చాలామందికి తెలియదు..ల్యాబ్ శరత్!