BigTV English

Game Changer: ఒరేయ్.. రిలీజ్ డేట్ చెప్పరేంట్రా.. టెన్షన్ తోనే పోయేలా ఉన్నాం

Game Changer: ఒరేయ్.. రిలీజ్ డేట్ చెప్పరేంట్రా.. టెన్షన్ తోనే పోయేలా ఉన్నాం

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి హీరో హీరోయిన్లుగా శంకర్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఈ సినిమాను  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.  ఆచార్య తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు  ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఎప్పుడెప్పుడు ఈ చిత్రం రిలీజ్ అవుతుందా .. ? అని వెయ్యి కళ్ళతో  వెయిట్ చేస్తున్నారు.


సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, జయరాం, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు  నటిస్తున్న ఈ సినిమా నుంచి  అప్డేట్ రావడం అంటే అదో  పండగలా ఫీల్ అవుతున్నారు  ఫ్యాన్స్. ఎన్నోరోజులుగా  గేమ్ ఛేంజర్  రిలీజ్ డేట్ పై  ఒక క్లారిటీ లేదు. దిల్ రాజు మాత్రం..   క్రిస్టమస్ కానుకగా డిసెంబర్  లో రిలీజ్ ఉంటుందని  చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ.. పుష్ప  2కు పోటీగా గేమ్ ఛేంజర్ వస్తున్నాడు అని మాట్లాడుకున్నారు. ఫ్యాన్స్ అయితే క్లాష్ కు రెడీ అయ్యారు.

ఇక  ఈ మధ్యనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్  డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్ ఫిక్స్ అని చెప్పాడు. ఇంకేముంది.. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యినట్లే అని సంబరపడ్డారు. కానీ, ఆ సంబరం ఆవిరి అవ్వడానికి ఎంతో సమయం లేదు అనిపిస్తుంది. గేమ్ ఛేంజర్ నుంచి వరుస అప్డేట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే నేడు.. గేమ్ ఛేంజర్  నుంచి రెండో సాంగ్ రిలీజ్ ప్రోమో కు ముహూర్తం ఖరారు చేశారు.


రా మ‌చ్చా మ‌చ్చా అంటూ సాగే ఈ ప్రోమోను సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ లో చరణ్ క్లాస్ లుక్ లో అదిరిపోయాడు.   జాతర బ్యాక్ గ్రౌండ్ లో  ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్. ఇక  ఇవన్నీ  పక్కన పెడితే ..   ఈ పోస్టర్ లో కూడా  రిలీజ్ డేట్ ను ఇవ్వలేదు. దీంతో మేకర్స్  పైకి మాటలు చెప్తున్నా.. రిలీజ్ డేట్ పై వారికి కూడా క్లారిటీ లేదని తెలుస్తోంది.

డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ వచ్చేలా కనిపించడం లేదని టాక్ నడుస్తోంది. ఇక ఈ వార్తలు విన్న చరణ్ ఫ్యాన్స్.. ఒరేయ్.. రిలీజ్ డేట్ చెప్పరేంట్రా.. టెన్షన్ తోనే పోయేలా ఉన్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  మరి ప్రోమో రిలీజ్ రోజు అయినా రిలీజ్ డేట్ చెప్తారా.. ? లేదా.. ? అనేది  చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×