Big TV Kissik Talks..గంగవ్వ (Gangavva).. యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ.. బిగ్ బాస్(Bigg Boss)లోకి అడుగుపెట్టి ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పలువురు స్టార్ హీరోలను మొదలుకొని యంగ్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో సుమారుగా 5-6 సినిమాలలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే..తాజాగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik talks)అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన గంగవ్వ.. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఎపిసోడ్ ను విడుదల చేయగా.. అందులో రాజకీయ ఎంట్రీపై అలాగే తాను కోరుకుంటున్న పదవి గురించి కూడా చెప్పుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
రాజకీయ ఎంట్రీపై గంగవ్వ క్లారిటీ..
పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నించగా గంగవ్వ మాట్లాడుతూ..” అటు కేటీఆర్(KTR )తోనూ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. ఇద్దరికీ కూడా నేను పరిచయస్తురాలినే. అటు కేటీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ పిలిచి ఏదైనా పదవి ఇస్తే ఖచ్చితంగా చేయడానికి నేను సిద్ధమే. నాలో కూడా ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. కానీ వారిద్దరిలో ఎవరైనా సరే నాకు అవకాశం ఇస్తే నేను కచ్చితంగా చేస్తాను. నిజానికి కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ నాకు అన్నదమ్ముల లాంటి వాళ్లు. మనమంతా ఒక్కటే. అందుకే నాకు ఎవరు పదవి ఇచ్చినా సరే నేను కాదనకుండా పూర్తి న్యాయం చేస్తాను” అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది.
ఇక ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అని వర్షా ప్రశ్నించగా.. రేవంత్ రెడ్డి ఏది చెబితే అది చేస్తాను. ఎందుకంటే వాళ్లు పెద్ద, నేను చిన్న.. వాళ్ళు ఏం చెప్పినా చేస్తాను అంటూ పొలిటికల్ కెరియర్ పై గంగవ్వ క్లారిటీ ఇచ్చింది . ఇక ఇప్పుడు కేటీఆర్ వచ్చి అడిగినా ఇదే చెబుతాను. ఎందుకంటే అందరూ మనవాళ్లే. కన్నతల్లులే .. కన్న బిడ్డలే అంటూ కూడా చెప్పుకొచ్చింది గంగవ్వ. మొత్తానికైతే గంగవ్వ చేసిన కామెంట్లు విని అభిమానులు కూడా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అవ్వకి ఆశ భలే ఉందే.. అటు కేటీఆర్ అయినా ఇటు రేవంత్ రెడ్డి అయినా పదవి మాత్రం ముఖ్యమంటోంది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గంగ ఒక సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఎపిసోడ్ కూడా ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ లో నిలిచింది.
ALSO READ: Thug Life Collections: థగ్ లైఫ్ 3డేస్ కలెక్షన్స్.. ఊరించి చంపారు.. మరీ ఇంత దారుణమా?
గంగవ్వ కెరియర్..
యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ.. ఆ తర్వాత బిగ్ బాస్ కార్యక్రమంలోకి రెండుసార్లు వెళ్లి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక చిరంజీవి (Chiranjeevi) ని మొదలుకొని చాలామంది హీరోల సినిమాలలో నటించింది. ఇక ఇప్పుడు కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నానని తెలిపింది. ఇకపోతే ఆ సినిమాలలో నటించిన తర్వాత తాను ఎలా నటించాను అనే విషయాన్ని తాను చూడనని, ఎవరైనా చూసి గంగవ్వ చాలా బాగా నటించింది అంటే అప్పుడు ఆనందం రెట్టింపు అవుతుందని చెప్పుకొచ్చింది గంగవ్వ.