BigTV English

Thug Life Collections: థగ్ లైఫ్ 3డేస్ కలెక్షన్స్.. ఊరించి చంపారు.. మరీ ఇంత దారుణమా?

Thug Life Collections: థగ్ లైఫ్ 3డేస్ కలెక్షన్స్.. ఊరించి చంపారు.. మరీ ఇంత దారుణమా?

Thug Life Collections..స్టార్ హీరోల సినిమాలకు భారీ బడ్జెట్లు పెట్టడంతోపాటు సినిమాకి హైప్ పెంచేలా భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తారు మేకర్స్. ముఖ్యంగా హీరో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ప్రమోషన్స్ లేకుండా కూడా అభిమానులు ఆ సినిమాను హిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో అభిమానుల నుండి అనుకోని స్పందన లభిస్తోంది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంటేనే సినిమాని ఆదరిస్తున్నారు.లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. ఎంత ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసినా కూడా ఆ సినిమాని ఆ హీరోల అభిమానులే ఫ్లాప్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీకి తెలియని, పరిచయం లేని హీరో హీరోయిన్ల సినిమాలను కూడా హిట్ చేస్తున్నారు.


అయితే కంటెంట్ బాగా లేకపోవడంతో తాజాగా బాక్స్ ఆఫీస్ ఎంతోమంది స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు కూడా బోల్తాపడుతున్నాయి.అలాంటి వాటిలో విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) మూవీ కూడా ఒకటి. కమల్ హాసన్ థగ్ లైఫ్ (Thug Life) మూవీ కలెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఇంతకీ ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ఎందుకు ఈ రిజల్ట్ వచ్చింది? అనేది ఇప్పుడు చూద్దాం..

థగ్ లైఫ్ 3డేస్ కలెక్షన్స్..


మణిరత్నం (Maniratnam) డైరెక్షన్లో సినిమా వస్తుందంటే ఈ సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు తీసిన మణిరత్నంపై అంత నమ్మకం. కానీ ఈ మధ్యకాలంలో ఈయన తీసే సినిమాలు అంత బాగుండడం లేదు. పిఎస్1, పిఎస్-2 సినిమాలకు కూడా ఆశించినంత ఫలితం రాలేదు.అలాగే తాజాగా వచ్చిన థగ్ లైఫ్ (Thug Life) మూవీ మరీ దారుణంగా డిజాస్టర్ గా నిలిచింది.

మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కి దేశవ్యాప్తంగా జూన్ 5న విడుదలైంది. కానీ ఈ సినిమా మొదటి రోజు రూ.15.5 కోట్లు,రెండో రోజు రూ.7.15 కోట్లు, మూడో రోజు రూ.5.84 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. అలా మొత్తంగా మూడు రోజుల్లో కలిపి దేశ వ్యాప్తంగా రూ.28.49కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది.. అయితే సినిమా విడుదలైన రోజే నెగిటివ్ టాక్ రావడంతో రోజురోజుకీ సినిమాకి కలెక్షన్లు భారీగా తగ్గిపోతున్నాయి.

ALSO READ: Big TV Kissik Talks: బిగ్ బాస్ 9 ఎంట్రీపై గంగవ్వ క్లారిటీ.. నాగ్ నా తమ్ముడే అంటూ!

ఇంత నెగిటివిటీ పెరగడానికి కారణం?

ఇక స్టార్ హీరో సినిమా కలెక్షన్స్ విషయంలో ఇలాంటి దారుణ పరిస్థితి ఎదురవుతుందని ఎవరు ఊహించి ఉంటారు. సినిమాకి ముందే భారీ హైప్ క్రియేట్ చేసి.. ఊరించి చంపారు.. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా డిజాస్టర్ అవ్వడంతో భారీగా కలెక్షన్లు తగ్గిపోయాయి. ఇదే సమయంలో కమల్ హాసన్ కన్నడ భాషా వివాదం కూడా సినిమాపై ప్రభావం చూపించింది. అలా కర్ణాటకలో ఈ సినిమా విడుదల కాకపోవడం కమల్ హాసన్ సినిమాకి మైనస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా సినిమాలో కథాబలం లేకపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంతో మూవీకి దారుణ కలెక్షన్లు వచ్చాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×