BigTV English

Gautam Ghattamaneni : ఘట్టమనేని వారసుడిగా గౌతమ్ ఫిక్స్ .. వైరల్ అవుతున్న నమ్రత పోస్ట్..

Gautam Ghattamaneni : ఘట్టమనేని వారసుడిగా  గౌతమ్ ఫిక్స్ .. వైరల్ అవుతున్న నమ్రత పోస్ట్..
Gautam Ghattamaneni

Gautam Ghattamaneni : అప్పుడెప్పుడో మహేష్ నటించిన 1 – నేనొక్కడినే మూవీలో మహేష్ బాబు చైల్డ్ హుడ్ క్యారెక్టర్ లో గౌతమ్ కనిపించాడు. మొదటి సినిమాలోనే తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కూడా గౌతమ్ వరుసగా సినిమాలలో కనిపిస్తాడు అని అందరూ ఆశించారు. ఎందుకంటే ఒకప్పుడు కృష్ణ ఇదే రకంగా తన ఇద్దరి కొడుకులతో కలిసి సినిమాలు చేస్తూ వచ్చాడు. మరీ ముఖ్యంగా ఒక వయసులో మహేష్ బాబుని చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ చేశారు. మహేష్ కూడా తన కొడుకు విషయంలో అదే స్ట్రాటజీ అవలంబిస్తాడు అని అందరూ ఆశించారు. అయితే ఆ ఒక్క సినిమా తర్వాత గౌతమ్ పూర్తి కాన్సన్ట్రేషన్ చదువుల పైనే పెట్టాడు మహేష్ బాబు.


గత కొద్ది కాలంగా మహేష్ కూతురు సితార ఘట్టమనేని బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో తిరిగి మరొకసారి గౌతమ్ విషయం తెరపైకి వచ్చింది. కొందరైతే గౌతమ్ ని అసలు సినీ ఫీల్డ్ లోకి తీసుకురావడం మహేష్ కి ఇష్టం లేదేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు వారి అంచనాలను తలకిందులు చేస్తూ గౌతమ్ కు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితమే లండన్ లో ప్లస్ టు పూర్తి చేసి గౌతమ్ ఎప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళాడు.

దీని గురించి ప్రస్తావించిన నమ్రత శిరోద్కర్.. తన కొడుకుతో దిగిన ఫోటోని షేర్ చేసుకోవడంతోపాటు మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలియపరచింది. ఈ ఫోటోలో చిన్నప్పటి గౌతం తన చేతిలో ఒక పేపర్ పట్టుకుని ఉన్నాడు. ఆ పేపర్ లో.. నేను పెద్దయిన తర్వాత ఇండియా, అమెరికాలో యాక్టర్ ని అవుతాను అని రాసి ఉంది. ఆ ఫోటోని షేర్ చేస్తూ నమ్రత.. “పలక మీద రాయడం దగ్గర నుంచి స్క్రిప్ట్ రాసే వరకు.. నీ కలలు, సంకల్పంతో అనుకున్నది నువ్వు కచ్చితంగా సాధిస్తావు.. జీవితం వెలుగొందడానికి లైఫ్ నీకు ఒక ఫుల్ సర్కిల్ అందించింది.. నువ్వు నీకోసం చేస్తున్న ఈ ప్రయాణంలో నీకు ఆనందం విజయం దక్కాలి అని కోరుకుంటున్నాను. లవ్ యు సో మచ్..” అని ఒక చిన్న ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది.


ప్రస్తుతం నమ్రత పెట్టిన ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది. యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడానికి గౌతమ్ అమెరికాకు వెళ్లినట్టు ఈ పోస్ట్ ద్వారా క్లియర్ గా అర్థం అవుతుంది. అంతేకాదు త్వరలో ఇండియాకి తిరిగి వచ్చి అతను హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది అని మహేష్ అభిమానులు సంతోషిస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క పోస్టు ద్వారా గౌతమ్ సినీ ఇండస్ట్రీలో వచ్చేస్తాడు అన్న వార్త కన్ఫర్మ్ అయిపోయింది. మరోపక్క తన కూతురు సితార సినిమాల్లోకి వస్తుంది అని గతంలో మహేష్ స్వయంగా వెల్లడించారు.ఇప్పుడు నమ్రత పోస్ట్ మహేష్ ఫ్యాన్స్ కి డబుల్ గుడ్ న్యూస్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×