BigTV English

Gayatri Bhargavi: దుల్కర్ సల్మాన్ పై యాంకర్ షాకింగ్ కామెంట్స్..ఎలా పరిచయమబ్బా..?

Gayatri Bhargavi: దుల్కర్ సల్మాన్ పై యాంకర్ షాకింగ్ కామెంట్స్..ఎలా పరిచయమబ్బా..?

Gayatri Bhargavi: ఒకప్పుడు బుల్లితెరపై వరుస షోలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ దక్కించుకుంది గాయత్రి భార్గవి(Gayatri Bhargavi). సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ అలరిస్తోంది. ఇదిలా వుండగా తాజాగా ఈమె మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquar Salman) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో.. ఎలా పరిచయం.. ?అంటూ నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఆమె మాటల్లోనే విందాం..


హిట్ అందుకున్న లక్కీ భాస్కర్..

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుత కాలంలో అన్ని భాషలలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. తాజాగా ఈ దీపావళికి ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మూడు రోజుల్లోనే రూ .40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించారు. ఇక ఈ సినిమాలో నటి యాంకర్ గాయత్రీ భార్గవి, దుల్కర్ సల్మాన్ తో పాటు నటించే బ్యాంక్ ఎంప్లాయ్ పాత్ర పోషించింది. ఇటీవల లక్కీ భాస్కర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈవెంట్ కి చిత్ర బృందం మొత్తం విచ్చేశారు.


దుల్కర్ సల్మాన్ మా పక్కింట్లో ఉండేవారు..

ఈ ఈవెంట్ లోనే దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించడం పై గాయత్రి భార్గవి మాట్లాడుతూ.. “దుల్కర్ సల్మాన్ తో నటించడం సంతోషంగా వుంది. ఒకప్పుడు చెన్నైలో మా పక్కింటిలో ఉండేవారు. కుర్రాడిగా చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేసేటప్పటి నుంచే నాకు ఈయన తెలుసు. అలాంటి ఈయనతో ఇప్పుడు కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది” అంటూ గాయత్రి భార్గవి కామెంట్లు చేసింది. అంతేకాదు “సినిమాలో ఇంకా ఎన్నో సీన్స్ లో మేమిద్దరం కలిసి కనిపించాలి. కానీ ఎడిటింగ్ లో తీసేశారు. దీని గురించి అటు ఎడిటర్ ,ఇటు డైరెక్టర్ ని ఇద్దరిని నేను అడగాలి ” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.

అన్ స్టాపబుల్ సీజన్ – 4 లో లక్కీ భాస్కర్..

ఇకపోతే ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ -4 రెండవ ఎపిసోడ్ కి లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ సల్మాన్ తో పాటు డైరెక్టర్, హీరోయిన్ ప్రమోషన్స్ కి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో దుల్కర్ మాట్లాడుతూ.. ” నేను కార్ ను చాలా ఫుల్ ర్యాష్ గా డ్రైవ్ చేస్తాను. 200 నుండి 300 స్పీడ్ లో కార్ నడిపే వాడిని “అంటూ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే భార్గవికి గతంలోనే దుల్కర్ సల్మాన్ గురించి తెలుసు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

బాపూ మనవరాలే..

గాయత్రి భార్గవి విషయానికి వస్తే.. 1984 సెప్టెంబర్ 18వ తేదీన జన్మించిన ఈమె, 2019లో విశ్వాసం, జనతా గ్యారేజ్ , నచ్చింది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇక ఈమె ఎవరో కాదు దిగ్గజ దర్శకుడు బాపూ (Bapu ) కి స్వయానా మనవరాలు. అయితే ఆయన పేరు వాడుకోకుండానే స్వసక్తితోనే ఈ స్థాయికి వచ్చినట్లు సమాచారం. ఈమె భర్త పేరు విక్రమ్. ఆర్మీలో పనిచేస్తూ.. దేశానికి సేవలు అందిస్తున్నారు కూడా.. ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. తన కెరీర్ కు తన భర్త ఎంతో సహాయపడతారని చెబుతూ ఉంటారు గాయత్రి భార్గవి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×