Kiran Abbavaram KA: హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తాజాగా దీపావళి సందర్భంగా విడుదల చేసిన చిత్రం ‘ క ‘ (KA Movie). విడుదలైన మొదటి రోజు యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత పుంజుకుంది. రోజు రోజుకి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. ఇకపోతే మొదటి రోజు అనుకున్న రేంజ్ లో స్క్రీన్స్ దొరక్కపోయినప్పటికీ అదే సమయంలో విడుదలైన సినిమాలకి కూడా మంచి పోటీ ఇస్తోంది. ఇకపోతే విడుదలైన మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే ఏకంగా రూ.19.41 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
మొదటి పాన్ ఇండియా చిత్రంతో భారీ సక్సెస్..
కిరణ్ అబ్బవరం తన మొదటి చిత్రమైన రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య ఘోరక్ తో ఇటీవలే ఏడడుగులు వేశారు. వివాహం అనంతరం ఆయన నటించిన తొలి చిత్రమే కాదు.. కిరణ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక మొదటి నుండే సినిమాపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు కిరణ్. సుజీత్ – సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఇందులో నయన్ సారిక , తన్వి రామ్ హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుంది అని ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం ప్రకటించారు. ఊహకందని ట్విస్టులతో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని కూడా కిరణ్ తెలిపారు.
‘క ‘ మూవీ కథ..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) చిన్నప్పుడే అమ్మా నాన్న లేని అనాథగా అనాథ శరణాలయంలో పెరుగుతూ ఉంటాడు. అక్కడ ఒక కొడుకుకి ఒక అమ్మ రాసిన ఉత్తరాన్ని చదువుతాడు. ఆ లెటర్ లో ఉన్న అక్షరాలను చదివిన తర్వాత వాసుదేవ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా అమ్మ ఉంటే కూడా ఇలాగే రాసి ఉండేదేమో అని అనుకుంటాడు. ఇక అప్పటినుంచి అందరి లెటర్లు చదవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఇక పోస్ట్ మాన్ అయితే అందరి ఉత్తరాలు చదవచ్చు కదా అనుకొని ఆ ఉద్యోగానికి అప్లై చేసి ,ఉద్యోగం సంపాదించుకుంటాడు. కాలక్రమేణా కృష్ణగిరి అనే ఒక మారుమూల ప్రాంతంలో పోస్ట్మాన్ గా ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు.
మ్యాజిక్ వర్క్ అవుట్ అయిందిగా..
ఇక అక్కడ అందరి లెటర్ లను రహస్యంగా చదువుతూ అన్ని విషయాలు తెలుసుకుంటాడు. అదే సమయంలో హీరోయిన్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. ఇక హీరోయిన్ తో లవ్ లో కొనసాగుతూ ఉన్న సమయంలో అనుకోకుండా ఆ ఊర్లో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. చివరికి అమ్మాయిలు మిస్ అవ్వడానికి గల కారణానికి సంబంధించి ఒక చిన్న క్లూ దొరుకుతుంది. ఆ క్లూ పట్టుకొని హీరో మిస్టరీని ఛేదించాడా అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఇకపోతే..”ఈ సినిమా కథ రొటీన్ కథ అనిపిస్తే, ఇకపై సినిమాలు చేయడం మానేస్తాను” అంటూ అందరిలో ఆసక్తి కలిగించిన కిరణ్ అబ్బవరం.. మాటలతో మ్యాజిక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా రోజురోజుకీ కలెక్షన్లతో దూసుకుపోతున్నారు అనడంలో సందేహం లేదు.