E-Paper
Advertisement

Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్.. త్రిష ఏ పాత్రలో నటిస్తుందో చెప్పేసిన మేకర్స్

Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్.. త్రిష ఏ పాత్రలో నటిస్తుందో చెప్పేసిన మేకర్స్
Advertisement

Good Bad Ugly: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ ఏడాది వరుస సినిమాలను రిలీజ్ చేసే పనిలో పడిన సంగతి తెల్సిందే. ఇప్పటికే విడమూయుర్చి సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు అజిత్ ఆశలన్నీ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు మైత్రీ మూవీ మేకర్స్.  విశాల్ కు మార్క్ ఆంటోనీ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ సరసన త్రిష నటిస్తుంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఎప్పటినుంచో  ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో  హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే.  దీంతో అభిమానులను శాంతిపర్చడానికి త్రిషకు సంబంధించిన  అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో త్రిష.. రమ్య అనే పాత్రలో నటిస్తుందని తెలిపారు. ఒక చిన్న గ్లింప్స్  లో త్రిష గ్రీన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో ఎంతో అందంగా  కనిపించింది. ప్రస్తుతం ఈ  గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఇకపోతే అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10 న రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం కూడా తెల్సిందే. అదే రోజున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది.  మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా  రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎన్నో ఆశలతో  ఎదురుచూస్తున్నారు.

Akkineni Sumanth: అనగనగా టీజర్.. సుమంత్ నటనతో ఏడిపించేశాడుగా 

Advertisement

కల్కి సినిమా తరువాత  ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో త రాజా సాబ్ మీద అంచనాలు ఆకాశాన్ని  తాకాయి. అందులో కూడా కామెడీ హర్రర్ అనడంతో ప్రభాస్ వింటేజ్ లుక్ ను దించడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు డార్లింగ్ హర్రర్ నేపథ్యంలో వచ్చే కథల్లో నటించింది లేదు.

మొదటిసారి హర్రర్ కామెడీ జోనర్ లో ప్రభాస్ నటిస్తున్నాడు. దీంతో పాటు ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు మూడు డిఫరెంట్  పాత్రల్లో కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  దీంతో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమా అంటే పెద్ద పెద్ద స్టార్లే వెనక్కి తగ్గుతారు. కానీ, అజిత్ ప్రభాస్ తోనే పోటీకి దిగుతున్నాడు అంటే ది రాజా సాబ్ మీద వస్తున్న పుకార్లు నిజమే అని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 10 న రావడం లేదని టాక్ నడుస్తోంది. అందుకే మిగతా సినిమాలు  ఈ డేట్ ను లాక్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ డేట్ న వచ్చే అజిత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×