AUS vs ENG: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament )
నేపథ్యంలో… ఆస్ట్రేలియా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. స్టార్ క్రికెటర్లు ఎవరూ లేకున్నా.. హిస్టరీ తిరగరాసింది. ఈ టోర్నమెంట్ లో ఇంగ్లాండ్ జట్టుపై ( England )… భారీ చేజింగ్ చేసిన కంగారులు…. బోణీ కొట్టారు. కీలక ప్లేయర్లు ఎవరూ లేకున్నా… ఇంగ్లాండ్ ప్లేయర్లకు చుక్కలు చూపించి… ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్ ( JOSH INGLIS ) సెంచరీ చేసి చెలరేగడంతో… అవలీలగా గెలిచింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పెట్టిన లక్ష్యాన్ని కేవలం 47.3 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆస్ట్రేలియా ( Australia).
Also Read: Indian National Anthem: పాకిస్తాన్ గడ్డపై.. ఇండియా జాతీయగీతం… గూస్ బంప్స్ రావాల్సిందే !
ఈ తరుణంలోనే… ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఏ జట్టు సాధించని రికార్డును నమోదు చేసుకుంది ఆస్ట్రేలియా. 352 పరుగుల లక్ష్యాన్ని… చేదించి.. చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో… అరుదైన రికార్డు సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. ఇలా ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా… భారీ చేజింగ్ చేయలేదు. ఇక ఈ మ్యాచ్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే…. మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది టికెట్లు నష్టపోయి 351 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ డకేట్ 165 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అలాగే ఇంగ్లాండ్ మిడిల్ లెటర్ ఆటగాడు రూట్ 68 పరుగులతో రాణించాడు. ఈ ఇద్దరు ప్లేయర్లు రఫ్ ఆడించడంతో… 351 పరుగుల భారీ లక్ష్యాన్ని.. కంగారుల ముందు ఉంచింది ఇంగ్లీష్ టీం. అయితే… ఎంత టార్గెట్ ఉన్న ఈజీగా చేజింగ్ చేయగల ఆస్ట్రేలియా… ఈ టార్గెట్ కూడా ఊది పారేసింది.
కేవలం 47.3 ఓవర్లలోనే ఐదు వికెట్ నష్టపోయి… 352 పరుగుల లక్ష్యాన్ని చేదించగలిగింది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలోనే ఓపెనర్ షార్ట్ 63 పరుగులతో దుమ్ము లేపాడు. ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్, అలాగే స్మిత్ ఇద్దరూ పెద్దగా రాణించలేదు. దీంతో ఆస్ట్రేలియా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అలాంటి సమయంలోనే లబుషంగే 47 పరుగులు అలాగే జోష్ ఇంగ్లీస్ 120 పరుగులు చేసి ఇద్దరూ అద్భుతంగా ఆడారు. వీరికి తోడు అలెక్స్ కూడా 69 పరుగులతో రాణించాడు. ఇక చివరిలో గ్లెన్ మాక్స్వెల్ రెండు సిక్సర్లు నాలుగు బౌండరీలతో రెచ్చిపోయాడు.
ఈ తరుణంలోనే 32 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో… మార్క్ వుడ్ , ఆర్చర్, కార్సే, రషీద్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్లో గెలిచి ఆస్ట్రేలియా బోనీ కొట్టింది. గ్రూప్ బి లో ఉన్న ఆస్ట్రేలియా పాయింట్స్ టేబుల్ లో కూడా రెండవ స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉంది. అటు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇటీవల జరిగిన 3 వన్డేల సిరీస్లో… ఇంగ్లీష్ ప్లేయర్లు దారుణంగా ఆడారు. దాని ఎఫెక్ట్ ఇక్కడ కూడా కనిపిస్తోంది.
Also Read: AUS vs ENG: ఇంగ్లండ్ భారీ స్కోర్ ..ఛాంపియన్స్ ట్రోఫీలో బెన్ డకెట్ కొత్త రికార్డు !
Missing their entire first-choice pace unit ❌
Playing the tournament without their captain ❌
Entering the tournament with an ODI series loss against Sri Lanka ❌Chasing the highest-ever total in Champions Trophy’s history ✅
Never Back Down 👊🏻🇦🇺#CricketTwitter #australia… pic.twitter.com/Oa1FFcHDF0
— InsideSport (@InsideSportIND) February 22, 2025