BigTV English

Rajalingam Murder : ఒక్క హత్య, వందల ప్రశ్నలు – రాజలింగం హత్యలో పెద్దతలలెవరు.?

Rajalingam Murder : ఒక్క హత్య, వందల ప్రశ్నలు – రాజలింగం హత్యలో పెద్దతలలెవరు.?
Rajalingam Murder : రాష్ట్రంలో  ఒక్క హత్య అనేక అనుమానాలకు తావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ కోర్టును ఆశ్రయించిన రాజ లింగ మూర్తి.. నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. అదే కేసీఆర్ పై పిటిషన్ వేయకపోతే.. ఈ వ్యక్తి హత్య ఇంతగా సంచలనం అయ్యేది కాదు. కానీ.. కీలకమైన కేసు వేసిన వ్యక్తి కావడం.. హత్య తర్వాత కేసును నీరు గార్చేందుకు పెద్ద తలలంతా ఏకం కావడం అనేక అనుమానాలకు కారణం అవుతుంది.  రేణిగుట్ల కుటుంబాన్ని అడ్డుగా పెట్టుకుని అనేక శక్తులు ఏకమయ్యాయని భూపాలపల్లిలో గట్టిగానే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా సాక్షాదారాలను ద్వంసం చేసి రెండు గంటల్లో క్లోజ్ చేసేలా ఉండాలని బహిరంగానే ఓ నేత మాట్లాడడంతో కేసులో పెద్దల ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి.

ఈ కేసులో ఓ సామాజిక వర్గం వారంతా కలిసి హత్యకు కుట్రలు చేశారా అనే విమర్శలూ బలపడుతున్నాయి.  ఆ ప్రాంతంలోని అనేక భూముల రిజిస్ట్రేషన్లకు అడ్డుగా వస్తున్నాయనే కారణంగా..  అందరి కళ్లలో అనందం కోసమే ఈ పని చేశామంటూ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. హత్య తర్వాతా నెమ్మదిగా ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో.. తొలుత 6 గుంటల భూమి కోసం హత్య జరిగిందని అంతా భావించారు. కానీ.. రోజుల గడుస్తున్న కొద్ది.. ఈ హత్యకు 50 కోట్ల ప్రభుత్వ భూమి కారణం అనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. దీంతో.. ఈ కేసును తవ్వేకొద్ది ఇంకా ఎన్ని భయంకర నిజాలు భయటపడనున్నాయో.? లోకల్ పోలీసులు కాకుండా ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేయించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.


ఈ కేసు విచారణ నిస్పక్షపాతంగా సాగితే తప్పా.. ఈ నిజాలు భయటపడే అవకాశాలే లేవని అంటున్నారు. జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందే కత్తులతో దాడి చేస్తే , స్ట్రీట్ లైట్స్ వెలగకుండా ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. పైగా నిందితులు లొంగిపోయి.. 18 గంటలైన ఇప్పటి వరకు కత్తిని గుర్తించలేకపోవడాన్ని బట్టి గతంలో అధికారంలోని గట్టి నాయకుల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. పోలీసులకు తెలిసే ఇదంతా జరిగిందనే అరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రతి హెడ్ క్వాటర్ ముందు గార్డ్ ఉంటారు. భూపాలపల్లి లాంటి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అయిన ఎస్పీ ఆఫీస్ ముందు మాత్రం ఆ రోజు గార్డు ఎందుకు లేడని  అనేక మంది ప్రశ్నిస్తున్నారు.

ఈ హత్య వెనుక 50 కోట్ల హిస్టరీ


భూపాలపల్లిలోని 106 ఎకరాల భూముల్ని అటవీ శాఖ అధికారులు సుప్రీం కోర్టు వరకు వెళ్లి కాపాడుకున్నారు. దాని విలువ రూ. 350 కోట్లుగా ఉంటుంది. కాగా.. ఈ భూమి పక్కన గ్యాబ్ ల్యాండ్ ( ఇరు గ్రామల మధ్య మిగులు భూమి) ఉండగా.. దానిని తమకే ఇవ్వాలంటూ ముత్యంరావు అనే భూస్వామి కుటుంబం లాబీయింగ్ చేస్తుంది. మంథనికి చెందిన వెంకట ముత్యం రావు కుటుంబానికి భూపాలపల్లి, జంగేడ్ ప్రాంతంలో 1400 ఎకరాల భూమి ఉండేది. సిలింగ్ లో ప్రభుత్వం ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంది. అందులో భూపాల పల్లిలో 19 ఎకరాలను ప్రభుత్వం అధికంగా తీసుకుందని ఆ భూమి ప్రధాన రోడ్డుకు వచ్చేలా ఇవ్వాలని.. ముత్యంరావు వారసుడు గొనే వెంకట వంశీ కృష్ణ రావు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు.

కొంపల్లి రెవెన్యూ పరిధిలోని ఫారెస్ట్ భూములకు, భూపాలపల్లిలోని సర్వే నెంబర్ 324 లోని భూములకు మధ్య భూమి కావడం. ఈ గ్యాబ్ ల్యాండ్ ప్రభుత్వానికి చెందాల్సింది చెందకుండా ప్రయివేట్ వారికి రిజిస్టర్ చేయడంపై రాజలింగ మూర్తి ఫైట్ చేశారు. ఫారెస్ట్ భూమిని ఎలా ఇస్తారని ఫారెస్ట్ అధికారులు అడ్డం తిరిగారు. దీని పైనే మృతుడు అధికారుల పైన కూడా పిర్యాదు చేశారు. ఇరు పార్టీల మధ్య కేసులు పెట్టుకున్నారు. రాజలింగం పైన రౌడీ షీట్ ఓపెన్ చేయించడంలో వంశీ కృష్ణ కేసులే కీలకంగా మారాయి. తాజాగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మళ్లీ ఫైల్ లో కదలికలు వచ్చాయి. దీన్ని అడ్డుకునేందుకు రాజలింగం ఫైట్ కొనసాగించారు.

Also Read : Masab Tank Tragedy: లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆ చిన్నారి ఇక లేడు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

ఇదే భూపాలపల్లిలో ధరణి వచ్చిన తర్వాత 800 ఎకరాలు ఓ ముస్లిం కుటుంబం పేరు మీద నమోదవుతుంది. ఇలా భూస్వాములు వారసత్వం అంటూ ప్రభుత్వం స్వాదీనం చేసుకున్న తర్వాత రాజకీయ నేతల అండదండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఈ దందా కామన్ గా మారిపోయింది. ఎవరైన ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇక్కడ కామన్ అంటున్నారు. ఇప్పుడు ఏకంగా హత్యకు గురవ్వడంతో ఈ భాగోతాలన్ని భయటపడుతున్నాయి.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×