Akkineni Sumanth: అక్కినేని నటవారసుడుగా ప్రేమకథ అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు సుమంత్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సుమంత్ ఆ తరువాత విజయాపజయాలను లెక్కచేయకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. అందులో కొన్ని హిట్ అవుతున్నాయి.. కొన్ని పరాజయాలు అందుకున్నాయి. ఇక అయినా కూడా సుమంత్ ఒక మంచి సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చాలా కసిగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అందులో భాగంగానే సుమంత్ కూడా డిజిటల్ బాట పట్టాడు.
సుమంత్ హీరోగా ఈటీవీ విన్ ఒరిజినల్ గా తెరకెక్కుతున్న చిత్రం అనగనగా. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి గదం, రుద్ర మాదిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుమంత్ సరసన కాజల్ చౌదరినటిస్తుంది. ఇప్పటికే అనగనగా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసి బెస్ట్ విషెస్ తెలిపాడు.
అనగనగా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అనగనగా.. ఒక స్టోరీ టెల్లర్ స్టోరీ అని ట్యాగ్ లైన్ ఇచ్చి కథను చెప్పేశారు. ” కథ అంటే ఏంటి.. అవెందుకు” అని ఒక చిన్నపిల్లాడి డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. వ్యాస్.. ఒక టీచర్. అతనికి సబ్జెక్టు చెప్పడం అంటే.. భట్టీ పట్టించడం కాదు. పిల్లలకు అర్ధం అయ్యేలా ప్రాక్టికల్ గా చెప్పాలనుకోవడం అనేది నమ్ముతాడు. అలా పాఠాలు చెప్తే ఎవరికి ఎక్కదు అని, పిల్లల తల్లిదండ్రులకు కేవలం మార్క్స్ మాత్రమే కావాలని అందరు చెప్తుంటారు. కథల ద్వారా.. పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలనుకునే వ్యాస్ ను అందరూ ఒక ఫెయిల్యూర్ టీచర్ గా హేళన చేస్తుంటారు. చివరికి అతని భార్య కూడా అదే అంటుంది. దీంతో వ్యాస్ మాస్టారు చాలా బాధపడుతుంటాడు. అసలు వ్యాస్.. ఏం అవ్వాలనుకున్నాడు.. ? ఎందుకు అతన్ని అందరూ ఫెయిల్ అని అంటారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Jayasudha: ఆ హీరో డంపింగ్ యార్డ్ కొనమన్నాడు.. పిచ్చా అనుకున్నా.. ఇప్పుడు దాని విలువ రూ. 100 కోట్లు
నోటితో విసిరేసి.. చేతులతో ఏరుకొనేది ఏంటి అనే పొదుపు కథలోనే.. కథ మొత్తాన్ని చూపించాడు డైరెక్టర్. నోటితో అక్షరాలను విసిరేసి.. చేత్తో రాసేది చదువు. అది ఒక విద్యార్థికి ఎంత అర్థవంతంగా చెప్తే అంత బాగా గుర్తుంటుంది. కానీ, ఇప్పటి తల్లిదండ్రులకు మార్కులు వస్తే చాలు.. స్కూల్స్ కు ర్యాంక్ లు వస్తే చాలు. పిల్లలకు బ్యాగ్ నిండా బుక్స్ ఇచ్చేసి.. 24 గంటలు చదివిస్తూనే ఉంటారు. ఇలాంటి వాటి మధ్య కథల రూపంలో పాఠాలను చెప్పే మాస్టర్ ఉంటే.. అతని కథనే ఈ సినిమా అని తెలుస్తోంది.
వ్యాస్ మాస్టారూగా సుమంత్ ఒదిగిపోయాడు. ఫెయిల్యూర్ గా అతను ఏడుస్తుంటే.. చూసేవారి కళ్లు కూడా కంటతడి పెట్టకమానదు అన్నట్లే ఉంది. చాలా గ్యాప్ తరువాత సుమంత్ ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఉగాది కానుకగా ఈటీవీ విన్ లో అనగనగా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో సుమంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Some stories are not just told, they are felt… ✨
Excited to launch the Teaser of #Anaganaga — a @etvwin Original film that beautifully captures the incredible story of our beloved teacher, Mr. Vyas, and his inspiring journey. 🎬🔥
📺 Teaser Out Now!
👉…— Dulquer Salmaan (@dulQuer) February 22, 2025