BigTV English

SSMB29 Update: మహేష్ బాబు ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. థియేటర్ల బద్దలవ్వడం ఖాయం..

SSMB29 Update: మహేష్ బాబు ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. థియేటర్ల బద్దలవ్వడం ఖాయం..

SSMB29 Update: టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. గుంటూరు కారం యావరేజ్ టాక్ అందుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా బాగానే వసూలు చేయడంతో ఆ సినిమా హిట్ అయింది.. ఇక ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. గతంలో ఎన్నడు లేని విధంగా మహేష్ బాబు ఇలా కనిపిస్తున్నాడని ఓ వార్త అయితే వినిపిస్తుంది. ఇంతకీ మహేష్ బాబు లుక్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


మొదటిసారి అలా కనిపించబోతున్న మహేష్..

త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి సినిమా కావడంతో SSMB29 మూవీ పై ముందునుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మహేష్ బాబు కూడా ఎప్పుడూ క్లాస్ గా స్టైలిష్ లుక్ లో కనిపించేవాడు.. కానీ ఇప్పుడు మాత్రం పొడవాటి జుట్టుతో, గడ్డంతో సరికొత్తగా కనిపిస్తున్నాడు. షూట్ లొకేషన్ లోని మహేష్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఫ్యాన్స్ కి ఆయన మరో ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. ఈ మూవీలో ఆయన షర్ట్ లెస్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ న్యూస్ పై మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే.. మహేష్ తోటి స్టార్స్ అందరూ దాదాపు షర్ట్ లెస్ ఫైట్స్ చేశారు. సిక్స్ ప్యాక్ లు చూపించారు. మహేష్ వర్కౌట్స్ చేస్తాడు, ఫిట్ గా ఉంటాడు. కానీ, ఎప్పుడూ సినిమాల్లో షర్ట్ లెస్ గా కనిపించలేదు. ‘SSMB29’లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉందట. ఇందులో మహేష్ చొక్కా విప్పి ఫైట్ చేస్తాడట. మొదటిసారి ఇలా కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఈసారి ఈ సినిమాతో థియేటర్లు బద్దలు అవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. మొత్తానికైతే ఈ న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది..


Also Read :ఛీ..ఛీ.. నవీన్ చంద్రకు కొంచెం కూడా బుద్దిలేదా..? కరుంగలి మాలతో ఆ పని..

షూటింగ్ అప్డేట్.. 

మహేష్ బాబు గతంలో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే రాజమౌళితో చేస్తున్న సినిమాపై జనాల్లో ఆసక్తి ఏ రేంజ్ లో ఉందో ఊహించవచ్చు.. ఈ మూవీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు రాజమౌళి కూడా ఇంతవరకు మాస్ హీరోలతో సినిమా చేశాడు. మహేష్ బాబు లాంటి క్లాస్ హీరోతో మొదటిసారి సినిమా చేయడంతో ఈ సినిమాకు పై ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో మరోసారి ఇండియాలో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ పాన్ వరల్డ్ లో గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో మహేష్ బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆయన తీవ్రంగా కష్టపడుతున్నాడు. తన కష్టానికి తప్పనిసరిగా ప్రతిఫలం అయితే దక్కుతుందని పలువురు సినిమా మేధావులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.. తనకైతే ఈ సినిమాకు థియేటర్లలోకి రాకముందే మంచి క్రేజ్ అయితే వచ్చేసింది. రాజమౌళి సినిమా కావడంతో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని జనాలు అభిప్రాయపడుతున్నారు.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేయడాది మార్చిలో రిలీజ్ కాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×