Naveen Chandra : ఈమధ్య సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు చేతిలోనూ లేదా మెడలో ఒక నల్లని పూసల వంటి మాలను ధరించి కనిపిస్తున్నారు. అది ఫ్యాషన్ కోసం అనుకుంటే పొరపాటే.. ఆ మాల వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని నమ్ముతున్నారు. ఇంతకీ ఆ మాల ఏంటంటే కరుంగలి మాల.. ధనుష్, సాయి పల్లవి, శివ కార్తికేయన్ వంటి వారంతా మాలను ధరిస్తూ కనిపిస్తారు. ఈమధ్య తెలుగు హీరో నవీన్ చంద్ర కూడా ఆ మాలను ధరిస్తున్నాడు. అయితే ఈ కరుంగని మాలను మెడలో వేసుకున్న వాళ్ళు నియమనిష్టలతో పద్ధతిగా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ హీరో మాత్రం నేను మాల వేసుకుని అలాంటి పనులు చేస్తానని బహిరంగంగానే చెప్పేసాడు. ప్రస్తుతం ఇది ఇటు సోషల్ మీడియాలోను.. అటు టాలీవుడ్ లోనూ హార్ట్ టాపిక్ అవుతుంది. ఇంతకీ నవీన్ చంద్ర ఈ మాల వేసుకుని ఎలాంటి పనులు చేస్తాడో ఒకసారి మనం తెలుసుకుందాం..
కరుంగళి మాల వల్ల ఉపయోగాలు..?
ఇటీవల చాలామంది యువత ఈ మాలను ధరిస్తూ ఉన్నారు. ఆన్ లైన్‌లో కూడా ‘కరుంగలి మాల’ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈ మాలను కేవలం సామన్యులే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఎక్కుగా ఆచరిస్తున్నారు.. సినీ ఇండస్ట్రీలోని ఎక్కువ మంది స్టార్లు ఈ మాలను ధరిస్తున్నారు. ఈమధ్య వీళ్ళు బయట ఎక్కడ కనిపించినా చేతిలో ఈ మాల కూడా ఉంటుంది. దీన్ని వాడటం వల్ల అనేక లాభాలు ఉన్నాయని కొందరు ప్రముఖులు చెబుతున్నారు. నిజానికి ఈ మాలను జమ్మి చెట్టు బెరడు నుంచి తయారు చేస్తారు. ఈ మాలను ధరించడం వల్ల అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని నమ్మకం.. విద్యార్థులు ఉద్యోగులు అందరూ ఈ మాలని ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం వాడుతూ ఉంటారు. దీని నుంచి వచ్చే వాసనతో ఒత్తిడి దూరం అవుతుందని కొందరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయితే హీరో నవీన్ చంద్ర మాత్రం ఈ మాలను అందుకే ఉపయోగిస్తాడట ఆయన ఏమన్నారంటే..
Also Read:చిరంజీవి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..
నవీన్ చంద్ర పై నెటిజన్లు సీరియస్..
హీరో నవీన్ చంద్ర ఈ మాల గురించి ఇటీవల ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఈ మాల వేసుకునే నేను నాన్ వెజ్ ని కూడా తింటున్నాను. నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవద్దని అంటారు కదా అని అడిగితే.. అలాంటివేమీ లేవని నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు. ఈ మాల వేసుకునే తాను నాన్ వెజ్ తింటాను.. అలాగే ఆ మాల ధరించే పడుకుంటాను. మన మనసులో నిబంధనలు తప్ప మాల వేసుకున్న తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలని ఏ శాస్త్రంలో చెప్పలేదంటూ హీరో అంటున్నారు. ఈ మాల నుంచి వచ్చే వాసన ఒత్తిడిని దూరం చేస్తుంది నేను అందుకోసమే ఈ మాల ని వేసుకుంటున్నాను అని ఆయన చెబుతున్నారు. మొత్తానికి కొందరేమో ఈ హీరోని సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం నవీన్ చంద్ర పై కామెంట్లు చేస్తున్నారు..