Hit 3: ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్ (Hit ) ఫ్రాంచైజీలో భాగంగా విడుదలైన చిత్రం హిట్ 3(Hit 3). మే ఒకటవ తేదీన నాని (Nani) హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో విలన్ గా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ (Prateik Babbar). ఇప్పటికే హిందీలో సుమారుగా 30కి పైగా సినిమాలలో నటించిన ఈయన.. తెలుగులో హిట్ -3 (Hit 3) లో విలన్ గా ఆల్ఫా పాత్రలో నటించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక అలాగే దర్భార్, సికందర్, భాగీ 2 వంటి చిత్రాలు ఈయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇకపోతే తెలుగులో ఈయనకు మంచి పేరు లభించడంతో ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈయన తల్లిదండ్రులు ఎవరు? అనే విషయాలు వైరల్ కాగా.. ఈయన తల్లి బ్యాక్ గ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
హిట్ 3 విలన్ ఎవరో తెలుసా..?
ప్రతీక్ బబ్బర్ ఎవరో కాదు ఒకప్పడు స్టార్ హీరోయిన్గా, మహానటి అనే పదానికి అసలైన ఐకాన్ గా నిలిచారు స్మితా పాటిల్ (Smita Patil ). ఉత్తమ నటిగా ఏకంగా రెండుసార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్న స్మిత పాటిల్ వారసుడే ఈ ప్రతీక్ బబ్బర్. స్మిత పాటిల్ సుమారుగా 80 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. అయితే దురదృష్టవశాత్తు ఆమె.. 31 ఏళ్ల ప్రాయంలోనే కన్ను మూసింది. స్టార్ హీరోయిన్ కాకముందే డైరెక్టర్లకు కండిషన్ పెట్టిన ఆమె, తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సరే చాలా తేలికగా రిజెక్ట్ చేసేది. గ్లామర్ షో కి దూరంగా ఉంటూ.. పర్ఫెక్ట్ పాత్రాలతో సాంప్రదాయంగా నటించి, స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా డబ్బు కోసం ఏ రోజు కూడా ఎలాంటి పనులు చేయలేదు. అందుకే అప్పట్లో ఆమెకు ఇండస్ట్రీలో గౌరవం కూడా అంతే ఉండేది. అయితే ఆమె చిత్ర పరిశ్రమంలో ఉన్నది కేవలం పదేళ్లు మాత్రమే. ఈ పదేళ్ల సమయంలో భారీగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇండియన్ సినిమా తెరపై మళ్ళీ ఇలాంటి నటిని చూడలేమేమో అనేంతలా సినీ అభిమానులను మెప్పించింది స్మితా పాటిల్.
also read; Bollywood: ఏకంగా ‘దీవి’నే సొంతం చేసుకున్న హీరోయిన్.. ఎక్కడ.. ఎన్ని కోట్లు.. మాట నిజమైందా.?
ప్రతీక్ బబ్బర్ జన్మించిన రెండు వారాలకే తల్లి మరణం..
1987లో కేతన్ మెహతా తీసిన ‘ మిర్చ్ మసాలా’ చిత్రంలో ఈమె నటనను ఫోర్బ్స్ పత్రిక..” భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల” జాబితాలో చేర్చింది. 1955లో జన్మించిన ఈమె 10 సంవత్సరాలలోనే 80 కి పైగా సినిమాలలో నటించింది. భారత ప్రభుత్వం చేత 1985లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకుంది. అంతేకాదు 2013లో ఈమె పేరుతో పోస్టల్ స్టాంప్ కూడా విడుదలయ్యింది. సినీ నటుడు రాజ్ బబ్బర్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అయితే ప్రతీక్ బబ్బర్ ను కన్న రెండు వారాలకే ఈమె చనిపోయింది. కాన్పు వల్ల కలిగిన అనారోగ్య సమస్యల కారణంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రెండు వారాలకే 1986 డిసెంబర్ 13న మరణించింది. ఇక తల్లి మీద ప్రేమతోనే హిట్ 3 నటుడు తన పేరును ప్రతిక్ స్మిత పాటిల్ గా మార్చుకున్నారు. ఇక అంతటి స్టార్ హీరోయిన్ కొడుకు ఇప్పుడు అదే స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పలువురు ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.