Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రస్థావరాలను చిత్తు చేసిన భారత్ పై పాకిస్తాన్ ప్రతిదాడులకు దిగింది. భారత్ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తే, పాకిస్తాన్ భారత పౌరులను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దాడులను భారత రాడార్ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అదే సమయంలో భారత్.. పాక్ రాడార్ వ్యవస్థను కుప్పకూల్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే అన్ని విమానాలు యూటర్న్ తీసుకున్నాయి. ఈ మేరకు ఫ్లైట్ రాడార్24 ఓ ఫోటోను షేర్ చేసింది. యూటర్న్ తీసుకున్న విమానాల్లో చాలా వరకు కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ లో ల్యాండ్ కావాల్సి ఉన్నాయి. అయినప్పటికీ, అక్కడి పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి తిరిగి వెళ్లినట్లు సదరు వెబ్ సైట్ వెల్లడించింది. ఈ విమానాలు చాలా వరకు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన అంతర్జాతీయ విమానాలే కావడం విశేషం.
Flights bound for Karachi, Islamabad, and Lahore currently holding or returning to origin. https://t.co/8qI3YkbOz0 pic.twitter.com/uGC56eE1fM
— Flightradar24 (@flightradar24) May 8, 2025
ప్రత్యామ్నాయం చూసుకుంటున్న అంతర్జాతీయ సంస్థలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత విమానాలను తమ ఎయిర్ స్పేస్ లోకి రాకుండా బ్యాన్ చేసింది. కానీ, ఇప్పుడు ఇతర దేశాలకు చెందిన విమానాలు కూడా పాకిస్తాన్ మీదుగా వెళ్లేందుకు భయపడుతున్నాయి. నిజానికి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అనేది ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలను కలుపుతూ కీలకంగా వ్యవహరిస్తోంది. పలు అంతర్జాతీయ విమాన సంస్థలు పాక్ ఎయిర్ స్పేస్ మీదుగా నిత్యం రాకపోకలు కొనసాగిస్తాయి. భారత్, మధ్య ఆసియా, యూరప్ రాకపోకలు పాక్ ఎయిర్ స్పేస్ మీదుగానే కొనసాగుతాయి. కానీ, భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పలు అంతర్జాతీయ సంస్థలు స్వచ్ఛందంగానే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ను ఉపయోగించుకోవడం మానేస్తున్నాయి. ఇప్పటికే లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్ వేస్ సహా పలు విమానయాన సంస్థలు అరేబియన్ సముద్రం, ఇరాన్, టర్కమెనిస్తాన్ మీదుగా తమ రాకపోకలు కొనసాగిస్తున్నాయి.
A busy Indian Airspace
Vs
an almost empty Pakistan’s air space pic.twitter.com/sg92lPKTMO— Resonant News🌍 (@Resonant_News) April 25, 2025
పాకిస్తాన్ కు చావు దెబ్బ
అంతర్జాతీయ విమాన సంస్థలు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకుంటున్న నేపథ్యంలో పాకిస్తాన్ కు వచ్చే ఫీజ్ పూర్తిగా పడిపోయింది. నిజానికి ఒక బోయింగ్ 737 పాక్ ఎయిర్ స్పేస్ మీదుగా ప్రయాణిస్తే ఇంచుమించు 580 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే రోజూ 3,00,000 డాలర్ల నష్టం కలుగుతోంది. అంటే, నెలకు సుమారు రూ. 75 కోట్లు కోల్పోతుంది. ఏడాది పాటు అంతర్జాతీయ సంస్థలు ఇదే పద్దతిని పాటిస్తే ఏకంగా రూ. 1000 కోట్ల వరకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఈ నష్టం కేవలం ఇండియన్ విమానాలకు ఎయిర్ స్పేస్ మూసివేయడం వల్ల జరిగే నష్టం. అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ పాక్ మీదుగా వెళ్లకపోతే ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడే అవకాశం ఉంటుంది. భారత్ కూడా పాకిస్తాన్ విమానాలకు తన ఎయిర్ స్పేస్ ను మూసేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ శ్రీలంక, చైనా మీదుగా కొనసాగాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో వారి ఇంధన ఖర్చు, ప్రయాణ సమయాన్ని పెంచుతుంది. భారత విమానాలకు ఎయిర్‌స్పేస్ మూసివేయడం భారతదేశానికి నష్టం కలిగిస్తున్నప్పటికీ, పాకిస్తాన్ కే ఎక్కువ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
Read Also: భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, విమానయాన సంస్థల కీలక నిర్ణయం!