BigTV English

Grok AI – Nithiin : గ్రోక్‌కు ఏం మాయ చేశారు బ్రో… మీకు ఇంతలా సపొర్ట్ చేస్తుంది..!

Grok AI – Nithiin : గ్రోక్‌కు ఏం మాయ చేశారు బ్రో… మీకు ఇంతలా సపొర్ట్ చేస్తుంది..!

Grok AI – Nithiin : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ (Nithin) ఒకప్పుడు వరుస సినిమాలతో భారీ విజయాలు సొంతం చేసుకుని, తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందో తెలియదు కానీ ఆయన చిత్రాలు వరుసగా డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. ఇక చివరిగా ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్.. ఆ తర్వాత ఆ రేంజ్ లో హిట్ కొట్టలేదు. అయితే ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. వెంకీ కుడుముల (Venky Kudumula)దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం రాబిన్ హు(Robinhood ) మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా దోపిడీ, యాక్షన్ , కామెడీ చిత్రంగా రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ప్రమోషన్స్ జోరు పెంచిన రాబిన్ హుడ్ టీమ్..

ఇకపోతే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీ.వీ.ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తూ ఉండగా.. షైన్ టామ్ చాకో, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sree Leela) హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు ఇందులో స్పెషల్ సాంగ్లో కేతిక శర్మ (Kethika Sharma) నటించిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలోని “అదిదా సర్ప్రైజ్” అనే స్పెషల్ సాంగ్ లో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) అందించిన హుక్ స్టెప్పు పై విమర్శలు కూడా గుప్పించారు. ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన నితిన్ ఏకంగా కృత్రిమ మేధా సంస్థ గ్రూప్ ఏఐ గ్రోక్ ను కూడా నితిన్ బుట్టలో పడేశారు అని స్పష్టంగా తెలుస్తోంది.


Ram Charan:ఆ యూనివర్స్ లో అడుగుపెడుతున్న గ్లోబల్ స్టార్… వాళ్లు ఇక తట్టుకోగలరా…?

గ్రోక్ ను బుట్టలో పడేసిన రాబిన్ హుడ్ టీమ్..

ఇక అసలు విషయంలోకి వెళితే ఏదైనా సమాచారం కావాలి అంటే గ్రోక్ ను అడిగిన వెంటనే క్షణాల్లో మనకు సమాధానం ఇస్తుంది. అలాంటి ఈ గ్రోక్.. “ఈ వారం ఏ మూవీకి వెళ్ళాలి అని గ్రోక్ ని అడిగితే, నా రికమండేషన్ రాబిన్ హుడ్” అని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే రాబిన్ హుడ్ మూవీ టీం.. ప్రమోషన్స్ కోసం గ్రోక్ ను ఎక్కువగా ఉపయోగించారు. అలాగే చివరి ట్రైలర్ రిలీజ్ ముహూర్తం కూడా గ్రోక్ తోనే పెట్టించుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ మూవీనే గ్రోక్ రికమండేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే గ్రోక్ తో హీరో డైరెక్టర్ బాగా ఫ్రెండ్షిప్ చేసి, చివరికి ట్రైలర్ రిలీజ్ ముహూర్తం కూడా గ్రోక్ తోనే పెట్టించి, అలా గ్రోక్ ను బుట్టలో వేసుకున్నారని చెప్పవచ్చు.

హీరో నితిన్ కాదు.. నాని అంటున్న గ్రోక్

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ వారం ఏ మూవీని చూడాలని అడిగితే..గ్రోక్ రాబిన్ హుడ్ సినిమా చూడండి అని అందరికీ సజెస్ట్ చేసింది. కానీ హీరో నితిన్ పేరు కాకుండా నాని పేరు చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇక హీరో, డైరెక్టర్ బుట్టలో వేసుకున్నారు. మొత్తానికైతే రాబిన్ హుడ్ పేరు బాగా ప్రమోట్ చేశారు కానీ ఆ సినిమాకి హీరో నేనే అని నితిన్ చెప్పడం మర్చిపోయాడెమో.. పాపం గ్రోక్ మాత్రం ఏం చేస్తుంది అంటూ కొంతమంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఏం చేశావు బ్రో.. ఏకంగా గ్రోక్ నే బుట్టలో పడేసావుగా అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×