BigTV English

Rohit Sharma – MS Dhoni: ధోనిని అవమానించిన రోహిత్… వీడియో వైరల్ !

Rohit Sharma – MS Dhoni: ధోనిని అవమానించిన రోహిత్… వీడియో వైరల్ !

Rohit Sharma – MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} వస్తుందంటే భారత్ లో అదే పెద్ద పండగ. క్రికెట్ అభిమానులతో పాటు సినీ తారలు కూడా స్టేడియాలలో తళుక్కున మెరుస్తారు. ఈ ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకలు ఆకాశాన్ని అంటే అంత ఘనంగా నిర్వహించాలని బిసిసిఐ ప్లాన్ చేసింది. ఈ ఆరంభ వేడుకలలో సినీ స్టార్స్ మైదానంలో మెరవనున్నారు. షారుఖాన్ నుంచి మొదలుపెడితే సల్మాన్ ఖాన్ వరకు పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఓపెనింగ్ సెర్మనీకి రానున్నారు.


నేడు కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7:30కు కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మొదటి ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఆ తర్వాత మరుసటి రోజు రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. ఒకటి సన్రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్. ఇది రేపు మధ్యాహ్నం 3:30 కు ప్రారంభం అవుతుంది. అదేవిధంగా రెండవ మ్యాచ్ చెన్నై సూప ర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ధోనిని అవమానించిన రోహిత్ శర్మ:


రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు గత ఏడాది వరల్డ్ కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ తరపున వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్ గా కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని సరసన రోహిత్ శర్మ చేరారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు కలిసి ఓ యాడ్ చేశారు. దీంతో ఈ ముగ్గురు ఛాంపియన్స్ చేసిన యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్యానల్ లా కనిపించే దాంట్లో కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోని కూర్చుని ఉండగా అక్కడికి రోహిత్ శర్మ వస్తాడు.

అనంతరం తన గ్లాసెస్ ని క్లీన్ చేస్తూ.. ” సెల్ఫీ చాహియే.. యా ఆటోగ్రాఫ్ చాహియే” అని అడుగుతాడు. ఈ ప్రశ్న విని ధోని, కపిల్ దేవ్ ఆశ్చర్యపోతారు. అనంతరం రోహిత్ శర్మ.. కపిల్ దేవ్, ధోనీలకు క్షమాపణలు చెబుతాడు.  ఈ వీడియో చూసిన కొంతమంది ధోని అభిమానులు.. ధోనీనే అవమానిస్తావా..? అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మరి కొంతమంది మాత్రం అది కేవలం యాడ్ లో భాగమని.. అయినప్పటికీ తరువాత క్షమాపణలు చెప్పాడు కదా అని అంటున్నారు.ఇక రోహిత్ శర్మ, ధోని మంచి స్నేహితులన్న విషయం మనకు తెలిసిందే. ఇక మహేంద్ర సింగ్ ధోని భారత దేశ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరు. క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ వైట్ బాల్ ట్రోపీలను గెలుచుకున్న ధోని.. 2007 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఇక కపిల్ దేవ్ 1983లో తొలి ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×