Ram Charan:రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ (Ram Charan). ఇందులో ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ (Krishna)తర్వాత ఆ పాత్రకు ఆ రేంజ్ లో న్యాయం చేసింది ఈయన మాత్రమే అని నెటిజన్స్ కూడా అప్పట్లో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అలా ఆ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రామ్ చరణ్, ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేశారు. ఈ సినిమా భారీ బడ్జెట్తో ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల అయ్యింది. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. కానీ ఆ తర్వాత ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమాకు పోటీగా వచ్చిన ప్రాంతీయ సినిమాలైన బాలకృష్ణ (Balakrishna) డాకుమహారాజ్ (Daaku Maharaj), వెంకటేష్ (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
వరుస చిత్రాలతో బిజీగా మారిన రామ్ చరణ్..
ఇక ఇదిలా ఉండగా ఈసారి ఎలాగైనా సరే మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న రామ్ చరణ్.. ‘ఉప్పెన’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న బుచ్చిబాబు సన(Bucchibabu Sana) దర్శకత్వంలో ‘ఆర్ సి 16’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా భాగమైనట్లు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మళ్లీ ‘రంగస్థలం’ కాంబోను రిపీట్ చేయనున్నారు. సుకుమార్(Sukumar ) దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టు ఎవరితో చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా సడన్గా ఒక ఊహించని న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
Nithin : గ్రోక్‌కు ఏం మాయ చేశారు బ్రో… మీకు ఇంతలా సపొర్ట్ చేస్తుంది..!
ఆ స్టార్ డైరెక్టర్ యూనివర్సల్ లోకి రామ్ చరణ్..
అదేమంటే ఒక స్టార్ డైరెక్టర్ యూనివర్స్ లోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు రావడంతో అభిమానులు సైతం ఈ విషయంపై ఆసక్తిగా ఎదురు చూడడమే కాకుండా ఆ కాంబో గురించి తెలిసి ఉబ్బితబ్బిబవుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తాజాగా గ్లోబల్ స్టార్ తో సినిమా చేసి తన ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ రామ్ చరణ్ కి కథ వినిపించగా ..ఆయన కూడా కథను సెట్ మీదకు తీసుకెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. ఏది ఏమైనా ఇదే గనుక నిజమైతే రామ్ చరణ్ యాంటీ ఫాన్స్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేరని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక లోకేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth) తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘విక్రమ్ 2’ ప్రాజెక్టు పూర్తి చేసి , ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.