F-404 engines – Tejas MK 1A : భారత వాయుసేన తీవ్ర ఆందోళన మధ్య తేజస్ యుద్ధ విమానాల తయారీలో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ లకు అమెరిన్ సంస్థ తయారీ ఇంజిన్లను అమర్చుతున్నారు. కానీ.. కొన్నాళ్లుగా ఇండియా-యూఎస్ఎ మధ్య నెలకొన్న తీవ్ర ఆందోళనల మధ్య ఈ ఇంజిన్ల సరఫరాలో మరింత జాప్యం చోటుచేసుకోవచ్చని అంతా భావించారు. కానీ.. ఈ నెలలోనే తేజస్ యుద్ధ విమానాల్లోకి అవసరమైన అత్యంత శక్తివంతమైన ఇంజిన్లను సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది.
ఈ పరిణామాన్ని భారత్-అమెరికా వాణిజ్య సుంకాలపై ఆందోళనల నేపథ్యంలో భద్రతా రంగంలో చోటుచేసుకున్న పురోగతిగా అభివర్ణిస్తున్నారు. కాగా.. రెండేళ్ల జాప్యం తర్వాత ఆమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ దారు మేజర్ జీఈ.. ఈ నెలలో హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ – HALకి ఆర్డర్ చేసిన 99 GE-404 ఇంజిన్‌లలో మొదటిదాన్ని డెలివరీ చేయనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న GE-404 ఇంజిన్‌లు తేజస్ మార్క్ 1-A ఫైటర్లలో వినియోగిస్తున్నారు. ఈ ఇంజిన్ల రాకలో నెలకొన్న తీవ్ర జాప్యం కారణంగా.. యుద్ధ విమానాల కొరత ఏర్పడుతుందని భారత వైమానిక దళం – IAF తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా సరఫరా చేయనున్న ఇంజిన్లల్లో మొదటిది ఇప్పటికే పరీక్ష దశలో ఉన్నట్లు చెబుతున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ నెలాఖరు నాటికి ఈ శక్తివంతమైన ఇంజిన్ ను డెలివరీ చేయవచ్చని చెబుతున్నారు. కాగా.. 2025 లో మొత్తం 12 ఇంజిన్ల చొప్పున.. ప్రతీ ఏడాది 20 ఇంజిన్లు GE ద్వారా డెలివరీ అవుతాయని హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ అధికారులు భావిస్తున్నారు.
ఒప్పదం ఏంటి.?
దేశీయ తయారీ యుద్ధవిమానం అయిన తేజస్ యుద్ధ విమానంలో అమెరికా సంస్థ తయారు చేస్తున్న శక్తివంతమైన ఇంజిన్ వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే.. 2021 లో USD 716 మిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందం ఇరు దేశాల మధ్య కుదిరింది. ఇందులో భాగంగా.. హిందుస్థాన్ ఎయిరో నాటిక్స్ – హాల్ సంస్థకు ఇంజిన్ తయారీ సంస్థ 99-ఇంజిన్లను అందించాల్సి ఉంటుంది. అయితే.. డెలివరీలో తీవ్రమైన జాప్యం కారణంగా.. ఇండియన్ ఎయిర్పోర్స్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఓ వైపు ఇండియన్ ఫైటర్ జెట్ ఇంజిన్ తయారు చేస్తూనే దేశీయంగా ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీకి ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా.. భారత్ – యూఎస్ మధ్య.. జాతీయ భద్రతా సలహాదారుల మధ్య క్రిటికల్, ఎమర్జింగ్ టెక్నాలజీల -iCET సాంకేతిక బదిలీ విధానంలో భాగంగా దేశీయంగానే శక్తివంతమైన GE-414 ఇంజిన్‌ను తయారు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పనిని అమెరికాకు చెందిన జీఈ సంస్థతో కలిసి DRDO పని చేస్తోంది. కాగా.. ఈ ఇంజిన్ ను అధునాతన మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA)లో వినియోగించాలని చూస్తున్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అసంతృప్తి
ఇదిలా ఉండగా.. హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ కు చెందిన 83 LCA MK-1A దేశీయ ఫైటర్ జెట్ తేజస్ తయారీ, సరఫరాలో జాప్యంపై IAF చీఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు హాల్ సంస్థపై నమ్మకం లేదంటూ ఘాటుగానే స్పందించారు. అనేక సందర్భాల్లో తేజస్ యుద్ధ విమానాల అందజేతలోని జాప్యంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో.. కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రక్షణ కార్యదర్శి RK సింగ్ అధ్యక్షతన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత ఐదో తరం యుద్ధ విమానాల కోసం వ్యాపార నమూనాను రూపొందించేందుకు ఈ కమిటీ సిఫార్సులు చేయాల్సిందిగా సూచించింది.
Also Read : Maoist Hidma : హిడ్మా ఎక్కడ? అమిత్‌షాకు సవాల్.. మోస్ట్ వాంటెడ్ గ్రేట్ ఎస్కేప్
ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి.. ఐదో తరం ఫైటర్ జెట్ అభివృద్ధి, తయారీలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి అవకాశం కల్పించాల్సిందిగా సూచించింది. భవిష్యత్తు కోసం, దేశ జాతీయ భద్రతా అవసరాలను తీర్చడానికి యుద్ధ జెట్లను తయారు చేసేందుకు.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన HAL మాత్రమే కాకుండా ఇతర సంస్థలు పోటీలో ఉండాలని సూచించింది.