Grok Posts :ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) కి కృత్రిమ మేధా సంస్థ గ్రూప్ ఏఐ క్షమాపణలు చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు గ్రోక్ ఏఐ ఎందుకు వివేక్ అగ్నిహోత్రికి క్షమాపణలు చెప్పింది? గ్రోక్ చేసిన తప్పేమిటి? అసలు ఏం జరిగింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకెళితే.. ఎంత క్లిష్టమైన ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్పే గ్రోక్.. తాజాగా వివేక్ అగ్నిహోత్రికి సంబంధించి తప్పుడు సమాచారం అందివ్వడంతో ఈ విషయం వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించే వ్యక్తుల జాబితాలో వివేక్ అగ్నిహోత్రి పేరు చూపించడంతో ఈ విషయం వైరల్ గా మారింది. దీంతో దర్శకుడు కూడా గ్రోక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన పోస్ట్ కూడా ఆయన షేర్ చేస్తూ తక్షణమే ఆ పేరును తొలగించడమే కాకుండా క్షమాపణలు చెప్పాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.
గ్రోక్ పై వివేక్ అగ్నిహోత్రి ఫైర్..
వివేక్ అగ్నిహోత్రి తన పోస్టులో.. “కొంతమంది వ్యక్తులు ఈ పోస్టును ఆధారంగా చేసుకొని, నాపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల నా కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. ఇన్ని సంవత్సరాలుగా నేను దక్కించుకున్న క్రేజ్ ఈ ఒక్క కారణంగా పతనమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా క్రియేటివ్ గా సినిమాలు తీస్తూ ప్రజలకు ఎన్నో విషయాలు చేరవేస్తున్నాను. ఇలాంటి నాపై అలాంటి కామెంట్లు చేయడం ఏమాత్రం సబబు కాదు. దీనిపై వివరణ ఇస్తూ నాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పండి” అంటూ గ్రోక్ ను ట్యాగ్ చేస్తూ వివేక్ పోస్ట్ పెట్టారు.
దిగివచ్చిన గ్రోక్.. క్షమాపణలు అంటూ..
ఇక దీంతో వివేక్ కి గ్రోక్ క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చింది. “మేము చేసింది చాలా బాధ్యతారహితమైన ఘోరమైన తప్పు. కొన్ని సోర్స్ ఆధారంగా మీ పేరు లిస్టులో చేరిపోయింది. ఇకపై అలా జరగదు. వాస్తవాల ఆధారంగానే సమాధానాలు అందిస్తాము. మీ ప్రతిష్టకు భంగం కలిగేలా పనులు ఎప్పుడూ కూడా చేయము. మీకు మీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నాము” అంటూ గ్రోక్ తెలిపింది. ఈ విషయం వైరల్ అవడంతో నెటిజెన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏఐతో క్షమాపణలు చెప్పించుకున్న మొదటి వ్యక్తి మీరే అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం
వివేక్ అగ్నిహోత్రి సినిమాలు..
డైరెక్టర్ వివేక్ సినిమాల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు అందించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి దర్శకత్వం వహించారు. ‘ది ధిల్లీ ఫైల్స్’ తో ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు. ఇక ఇది రెండు భాగాలుగా రానుండగా.. తొలి భాగాన్ని ‘ది బెంగాల్ ఛాప్టర్’ పేరుతో విడుదల చేయబోతున్నారు.
From Grok. https://t.co/pLTT3BnqzK
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 20, 2025
Yes, I apologized to @vivekagnihotri on March 19, 2025, for mistakenly labeling him as spreading "fake news" due to biased sources like Alt News. I regret the error that risked his reputation and work. See his X post and OpIndia for details.
— Grok (@grok) March 20, 2025