Kohli IPL Salary: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} అంటేనే దూకుడుకు పర్యాయపదం. ఈ ఐపీఎల్ ని క్యాష్ రిచ్ లీగ్ గా వర్ణిస్తారు క్రికెట్ విశ్లేషకులు. పైకి అభిమానులకు వినోదాన్ని అందించే సాధనంగా కనిపిస్తున్న ఈ ఐపీఎల్.. కోట్లాది రూపాయల వ్యాపారం అన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోని టాప్ కంపెనీలన్నీ ఐపిఎల్ కి స్పాన్సర్స్ గా వ్యవహరించేందుకు ఎగబడతాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ లీగ్ క్రేజ్ ఎంటో.
Also Read: Cricketers – Betting Apps case: బెట్టింగ్ యాప్ లు… క్రికెటర్ల పై చర్యలు ఉండవా?
ఇక ఈ లీగ్ లో ఆడే క్రికెటర్లకు ఐపీఎల్ ఓ కామదేనువు. ప్రతిభ ఉన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లాను కోట్లు ఖర్చు చేసి మరియు వారిని దక్కించుకుంటాయి. ఈ ఐపీఎల్ లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన ఆటగాళ్ల జాబితా చాలానే ఉంది. సీనియర్లతోపాటు యంగ్ క్రికెటర్లలో కూడా చాలామంది ఐపిఎల్ ద్వారానే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. యంగ్ క్రికెటర్లలో తిలక్ వర్మ, గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్ లు ఐపీఎల్ ద్వారానే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.
కేవలం భారత్ లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ తో ఎంతోమంది ఆటగాళ్లు జాతీయ జట్టులో అవకాశాలు సాధించారు. అయితే భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2008 ఐపీఎల్ ప్రారంభంలో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు జట్టులో చేరారు. రేపటినుండి ఈ ఐపీఎల్ 18వ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. 17 సంవత్సరాలుగా అతడు ఆర్సిబి జట్టుతోనే కొనసాగుతున్నాడు.
ఇప్పటివరకు ఈ లీగ్ యొక్క ప్రతి సీజన్ లో ఓకే ఫ్రాంచైజీ కి ప్రతినిత్యం వహించిన ఏకైక ఆటగాడు కోహ్లీ. 2008 ఐపీఎల్ డ్రాఫ్ట్ లో విరాట్ కోహ్లీని 12 లక్షలకు సొంతం చేసుకుంది ఆర్సిబి. అనంతరం 2010లో ఆర్సిబి జట్టు తన టీమ్ లో మార్పులు చేసింది. కేవలం ఒకే ఒక్క ఆటగాడిని మాత్రమే నిలుపుకుంది. అతడే విరాట్ కోహ్లీ. 2010లో అతడు జీతాన్ని 8.28 కోట్లకు పెంచింది. అలా 2013 వరకు విరాట్ కోహ్లీ ప్రతి సంవత్సరం 8.28 కోట్లు సంపాదించాడు.
Also Read: IPL 2025: చీర్ లీడర్లకు ఒక్కో మ్యాచ్ కు ఎంత ఇస్తారో తెలుసా ?
ఇక 2014 మెగా వేలం సందర్భంగా విరాట్ కోహ్లీ జీతం మరోసారి పెరిగింది. 2014 మెగా వేలానికి ముందు ఆర్సిబి నిలుపుకున్న ముగ్గులు ఆటగాలలో విరాట్ కోహ్లీ ఒకరు. తదుపరి నాలుగు సీజన్లకు విరాట్ కోహ్లీని 12.5 కోట్లకి రిటైన్ చేసుకుంది ఆర్సిబి. ఆ తర్వాత 2013 నుండి 2021 వరకు ఆర్సిబికి కెప్టెన్ గా వ్యవహరించాడు కోహ్లీ. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ జట్టు నాయకత్వ బాధ్యతలనుండి తప్పుకున్నాడు. ఇక ప్రస్తుతం 2025 మెగా వేళానికి ముందు ఆర్సిబి విరాట్ కోహ్లీని.. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. అలా ఐపీఎల్ ప్రారంభం 2008లో 12 లక్షలు అందుకున్న కోహ్లీ.. ప్రస్తుతం 21 కోట్లు తీసుకుంటున్నాడు.