Fan Wars: స్వర్గీయ నందమూరి తారక రామారావు, సూపర్ స్టార్ కృష్ణలు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరిగాయి. ఆ తర్వాత తరంలో చిరంజీవి, బాలకృష్ణల మధ్య బాక్సాఫీస్ పోటీ ఉంటే వారి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ జరిగేది. ఈ మెగా నందమూరి ఫ్యాన్ వార్ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. గ్రూపులు ఫామ్ చేసి మెగా నందమూరి అభిమానులు కొట్టుకునే దగ్గర నుంచి పగలు పెంచుకునే వరకూ వెళ్లింది. ఈ మెగా నందమూరి ఫ్యాన్ వార్స్ సినిమాల రిజల్ట్ కి మాత్రమే పరిమితం అయ్యేది.
ఈ జనరేషన్ ఫ్యాన్ వార్స్ మాత్రం సినిమాల కలెక్షన్స్ ని దాటి చాలా దూరం వెళ్లింది. ఎన్ని సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది దగ్గర నుంచి, మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టింది, ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, ప్రిమియర్స్ లో ఎన్ని కోట్లు అడ్వాన్స్ కలెక్షన్స్ రూపంలో రాబట్టింది… ఇలా కలెక్షన్స్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు పోస్టర్స్ ఎంత వైరల్ అయ్యాయి, సాంగ్స్ కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ అండ్ షేర్స్ వస్తున్నాయి అనే విషయాల్లో ఫాన్స్ వార్స్ జరుగుతున్నాయి.
ఈ ఆన్లైన్ ఫ్యాన్ వార్స్ కి ట్విట్టర్ కేరాఫ్ అడ్రెస్ గా మారింది. X ఓపెన్ చేస్తే చాలు ప్రతి రోజు ఎదో ఒక విషయంలో ఒక హీరో ఫాన్స్, ఇంకో హీరో ఫాన్స్ తో గొడవ పడుతూనే ఉంటారు. ఈ గొడవలు ఒక్కోసారి పర్సనల్ గా తిట్టుకునే వరకూ వెళ్తుంది కూడా. లేటెస్ట్ గా ఈ ఆన్లైన్ ఫ్యాన్ వార్ పవన్ కళ్యాణ్-మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య జరుగుతుండగా… ఈ ఫ్యాన్ వార్ లోకి గ్రోక్ ఎంటర్ అయ్యింది.
‘X’ డెడికేటెడ్ AI చాట్ బాట్ గ్రోక్, చాట్ జీపీటీని కూడా బీట్ చేసి టాప్ ప్లేస్ కి వెళ్లింది. సంచనలనాలు సృష్టిస్తున్న గ్రోక్ ని మన మూవీ లవర్స్ పోస్టర్స్ ఎడిట్స్ కి మాత్రమే కాకుండా ఫ్యాన్ వార్స్ లోకి కూడా లాగుతున్నారు. పచ్చి భూతులు మాట్లాడుతూ, ఎవరు ఏ పదంతో తిడితే అదే పదంతో తిరిగి తిడుతున్న గ్రోక్… అందరికీ చుక్కలు చూపిస్తుంది. వాడుక బాషలోనే తిడుతున్న గ్రోక్ దెబ్బకి అందరికీ ఫ్యుజులు కొట్టేస్తున్నాయి.
గ్రోక్ తోనే చుక్కలు కనిపిస్తున్నాయి అనుకుంటే కొన్ని మీమ్ పేజస్, సోషల్ మీడియా సైట్స్ గ్రోక్ తిట్టిన తిట్లని పోస్ట్ చేస్తూ మరింత రచ్చ చేస్తున్నాయి. AI టెక్నాలజీతో ఎప్పటికైనా ప్రమాదం అనే మాట చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది, ఇప్పుడు గ్రోక్ తిట్టే తిట్లు చూస్తుంటే అది నిజమనే అనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని జాగ్రత్తగా వాడకపోతే, జరగబోయే ప్రమాదాలు ఎలా ఉంటాయో గ్రోక్ సాంపిల్ చూపిస్తోంది.