Pakistan Cricket: పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ట మధ్య 5 మ్యాచ్ ల టి-20 సిరీస్ ఏప్రిల్ 16 {ఆదివారం} నేటినుండి ప్రారంభం అయ్యింది. ఈ సిరీస్ మార్చ్ 16 నుండి మార్చి 26 వరకు కొనసాగనుంది. ఈ సిరీస్ లోని ఐదు మ్యాచ్ లు ఐదు వేదికలలో జరగనున్నాయి. న్యూజిలాండ్ జట్టుకు ఆల్రౌండర్ మైఖేల్ బ్రాస్ వెల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా తొలిసారి అఘా సల్మాన్ బాధ్యతలు చేపట్టాడు.
Also Read: WPL 2025 : దరిద్రం అంటే వీళ్లదే…. మూడు సార్లు ఫైనల్స్ ఓడిపోయారు !
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇరు జట్లకు ఇదే తొలి సిరీస్. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆట తీరు ఏమాత్రం మారలేదు. ఈ ఐదు టి-20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ-20 లో పాకిస్తాన్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్.. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది.
న్యూజిలాండ్ పేస్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాటర్లు బెంబేలెత్తారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ నాలుగు వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. అలాగే కైల్ జేమిసన్, ఇష్ సోది చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక పాకిస్తాన్ బ్యాటర్లలో కుష్దిల్ షా {32}, కెప్టెన్ ఆగా సల్మాన్ {18} పరుగులు మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 92 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 10.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది.
న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సిఫర్ట్ విధ్వంసకర బ్యాటింగ్ తో 29 బంతులలోనే ఏడు ఫోర్లు, ఒక సిక్స్ తో 44 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అలాగే ఫిన్ అలెన్ {29}, రాబిన్ సన్ {18} నాటౌట్ గా నిలిచి న్యూజిలాండ్ ని సునయాసంగా విజయతీరాలకు చేర్చారు. కాగా పాకిస్తాన్ బౌలర్లలో అర్బన్ అహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర ఓటమిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.. న్యూజిలాండ్ టూర్ కోసం జట్టులో మార్పులు చేసింది.
Also Read: Rohit Sharma – Maldives: IPL ముందు భార్యతో రోహిత్ ఎంజాయ్..?
కెప్టెన్ రిజ్వాన్, బాబర్ అజామ్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. వీరి స్థానంలో హాసన్ నవాజ్, ఇర్ఫాన్ ఖాన్, అబ్దుల్ సమద్ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. కానీ వీరు కూడా వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక న్యూజిలాండ్ గడ్డపై పాకిస్తాన్ కు ఇదే అత్యాల్ప టి-20 స్కోర్. ఇక చాంపియన్స్ ట్రోఫీలో ఘోర ఓటములతో ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ మొదటి టి-20 లోనే ఓటమితో విమర్శలు తారాస్థాయికి చేరాయి.