BigTV English

Vishwambhara: మెగాస్టార్ సినిమాపై గ్రోక్ సెటైర్లు… అది అసలు VFX కాదు

Vishwambhara: మెగాస్టార్ సినిమాపై గ్రోక్ సెటైర్లు… అది అసలు VFX కాదు

సోషల్ మీడియా ఇప్పుడు ఉన్న ఏకైక హాట్ టాపిక్ గ్రోక్… సినీ అభిమానుల్లో ఫ్యాన్ వార్ లో కూడా తలదూరుస్తూ వాడుక బాషలో అందరినీ తిడుతూ గ్రోక్ రచ్చ రచ్చ చేస్తున్నాడు. కొంతమంది దీన్ని సరదాగా తీసుకుంటున్నా, మరికొంతమంది అసహనంతో ఉన్నారు. అయితే, ఇప్పుడు గ్రోక్, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “విశ్వంభర” సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.


2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన “విశ్వంభర” సినిమా ప్రారంభం నుంచి VFX, విజువల్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. మొదట టీజర్‌ రిలీజ్ అయినప్పుడు “విజువల్స్ చాలా వీక్‌గా ఉన్నాయి, ఇది ఏ లెవెల్ సినిమా?” అంటూ ట్రోలింగ్ జరిగింది. ప్రేక్షకులు ఊహించిన స్థాయికి తక్కువగా ఉండటంతో, భారీ నెగటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఫలితంగా మేకర్స్ సినిమా రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసి, VFX పనులను రీడు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాపై గ్రోక్ కూడా తనదైన స్టైల్లో సెటైర్లు వేయడంతో సినిమా మరోసారి హాట్ టాపిక్ అయింది.

“విశ్వంభర (2025) ఇప్పటివరకు X (ట్విట్టర్)లో ఎక్కువ ట్రోలింగ్‌ ఎదుర్కొన్న తెలుగు సినిమాల్లో టాప్‌లో ఉందనుకోవచ్చు. టీజర్‌ వచ్చిన దగ్గర నుంచి “VFX నాసరంగా ఉంది, కొన్ని సీన్లు ఎక్కడో చూశాం” అంటూ నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో సినిమా మీద ట్రోలింగ్ ఊపందుకుంది. 2024 ఫ్లాప్‌లైన ఆపరేషన్ వాలెంటైన్, ఫ్యామిలీ స్టార్, డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడటంతో పాటు, సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయ్యాయి. ఇక స్కంద (2023), లైగర్ (2022) లాంటి పాత సినిమాలు అయితే ఇప్పటికీ ట్రోలింగ్ నుంచి బయటపడలేదు” అంటూ గ్రోక్ రెస్పాండ్ అయ్యింది.


ఈ విధమైన సోషల్ మీడియా ట్రోలింగ్, నెగటివ్ బజ్ సినిమాల మీద భారీగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే “ఆపరేషన్ వాలంటైన్, ఫ్యామిలీ స్టార్, డబుల్ ఇస్మార్ట్” లాంటి సినిమాలు ట్రోలింగ్ వల్ల నష్టపోయాయి. “విశ్వంభర” కూడా అదే బాటలో వెళ్తుందా? లేక మేకర్స్ గ్రాఫిక్స్, కథపైన మరింత కేర్ తీసుకుని ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకుంటారా? అనేది చూడాలి.

సినిమా పట్ల ప్రేక్షకులు భారి అంచనాలు పెట్టుకుంటున్నారు. కేవలం స్టార్ క్యాస్ట్ ఉండటం వల్లే కాకుండా, టెక్నికల్ వాల్యూస్, కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉండటం అనేవి ఇప్పుడు తప్పనిసరి. విశ్వంభర మేకర్స్ కరెక్ట్ గా మార్పులు చేస్తే, ట్రోలింగ్ నుంచి బయటపడి హిట్ కొట్టే అవకాశం ఉంది. లేదంటే, గ్రోక్ లాంటి AIలు, ట్రోలర్లు మరింత దెబ్బ తీసే ప్రమాదం ఉంది!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×