Sunita Williams Hair: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో హ్యోమగామి సునీతా విలియమ్స్ ఎప్పుడూ లూజ్ హెయిర్ తోనే కనిపించేది. ఆమె జుట్టు గాల్లో ఎగురుతున్నట్లుగా కనిపించేది. గుబురు జుట్టు అందరినీ ఆకట్టుకునేది. అమెరికా అధ్యక్షుడు డొలాల్డ్ ట్రంప్ కూడా తాజాగా సునీత జుట్టు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె జుట్టు చాలా అందంగా, ధృడంగా ఉంటుందని ప్రశంసించారు. అడవిలా జుట్టు ఉన్న ఆ మహిళ అంటే అందరికీ ఇష్టమేనన్నారు. ఆమె జుట్టును చూస్తే, తను ఎంత ధైర్యవంతురాలో అర్థం అవుతుందన్నారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఆమె జుట్టు గురించి నెటిజన్లు ఆసక్తిక చర్చ జరిగింది. అంతరిక్షంలో మహిళా హ్యోమగాములు తమ జుట్టును ఎందుకు ముడివేసుకోరు? జుట్టును ఎలా శుభ్రపరచుకుంటారు? అనే ఆసక్తికర ప్రశ్నలు ముందుకు వచ్చాయి. వాటికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గురుత్వాకర్షణ శక్తి ఉండదు
అంతరిక్షంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు. జుట్టు కిందికి వాలిపోదు. సాధారణంగా జుట్టు పైకి ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే, ముడివేయకుంగా అలాగే వదిలేస్తారు. జీరో గ్రావిటీ కారణంగా జుట్టును ఫ్రీగా వదిలేసినా ముఖం మీదికి వచ్చి ఇబ్బంది కలిగించదు. జుట్టుతో ఎలాంటి సమస్య ఉండదు కాబట్టే, లూజ్ గా వదిలేస్తారు.
సులభంగా గాలి ప్రసరణ జరిగేలా
వ్యోమగాములు తరచుగా పలు పనుల కోసం హెల్మెట్లు ధరిస్తారు. జుట్టు విప్పి ఉంచడం వల్ల నెత్తి చుట్టూ గాలి ప్రసరణ మెరుగ్గా కొనసాగుతుంది. తలను చల్లగా ఉంచడానికి సహాయ పడుతుంది. జుట్టును ముడివేడయం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.
మెయింటెనెన్స్ తక్కువ
భూమి మీద జుట్టు తరచుగా చిక్కుబడిపోతుంది. జుట్టు దువ్వుకోవడం, లబ్బర్ బ్యాండ్ తో ముడేయడం చేస్తారు. కానీ, అంరిక్షంలో గ్రావిటీ లేకపోవడం వల్ల జుట్టు చిక్కు పడదు. ఎలాంటి ఇబ్బంది కలిగించదు.
అందం, ఆనందం..
ఇక జీరో గ్రావిటీలో జుట్టు తేలియాడుతున్న దృశ్యాలు ఐకానిక్ ఇమేజరీని సృష్టిస్తాయి. అంతరిక్ష కేంద్రంలో హ్యోమగాముల అందాన్ని హైలెట్ చేస్తాయి.
జుట్టును ఎలా శుభ్రం చేసుకుంటారంటే?
అంతరిక్షంలో మహిళా హ్యోమగాములు జుట్టు మీద నీటిని స్ప్రే చేస్తూ శుభ్రం చేసుకుంటారు. షాంపోను కూడా అలాగే స్ప్రే చేస్తారు. జుట్టు మీద పడిన నీటిని తుడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తల మీద ఉన్న నీరంతా అంతరిక్షంలో ఘనీభవించి తాగు నీరుగా మారిపోతుంది.
అంతరిక్షం నుంచి భూమ్మీది వచ్చాక ఏమవుతుంది?
అంతరిక్షంలో చాలా రోజులు ఉన్న హ్యోమగాములు భూమ్మీదకు వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ భార రహిత స్థితిలో జీవించడంతో ఎముకలు, కండరాలు బహీనంగా మారుతాయి. భూమ్మీదికి రాగానే, కనీసం నిలబడలేరు. కూర్చోలేరు. పడుకోలేరు. అందుకే, బెల్ట్ పెట్టి కూర్చోబెడతారు. నిలబడేందుకు కూడా అలాంటి సపోర్టు అందిస్తారు. వెంటనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎముకలు, కండరాల పటుత్వం కోసం మెడిసిన్స్ అందిస్తారు. వాళ్లు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేలా స్విమ్మింగ్ పూల్ లో ఎక్కువగా ఉంచుతారు. సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు ఇలాగే అబ్జర్వేషన్ లో ఉంటారు. కిందికి వచ్చాక కూడా స్పేస్ లో మాదిరిగానే కొద్ది రోజులు లిక్విడ్ ఫుడ్స్ అందిస్తారు. అంతరిక్షంలో జుట్టు, గోర్లు వేగంగా పెరుగుతాయి. ముఖం మీద ముడతలు తొలగిపోతాయి.భూమికి తిరిగి వచ్చిన తరువాత ఈ మార్పులు పూర్తి రివర్స్ గా మారుతాయి.
Read Also: తొమ్మిది నెలల తర్వాత.. స్పేస్ నుంచి భూమి పైకి వ్యోమగామి సునీత, విల్మోర్‌లు