SRH Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టోర్నమెంటుకు సంబంధించిన పది జట్ల ప్లేయర్ లందరూ.. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ప్రతి జట్టు రెండుగా చీలిపోయి.. ప్రాక్టీస్ చేస్తున్నాయి. విదేశీ ప్లేయర్లు కూడా తమ జట్టులో చేరిపోయి.. కసరత్తులు మొదలుపెట్టారు. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కొనసాగనుంది. అంటే దాదాపు 75 రోజులపాటు ఈ మెగా టోర్నీ కొనసాగుతుంది.
Also Read: Hardik Pandya: ప్రియురాలితో శ్రీలంక ట్రిప్.. అడ్డంగా దొరికిపోయిన టీమిండియా ప్లేయర్ ?
అయితే ఇలాంటి నేపథ్యంలో… రెండు తెలుగు రాష్ట్రాలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) జట్టు పైన భారీగా అంచనాలు పెరిగాయి. ఐపీఎల్ 2024లో ఫైనల్ వరకు చేరి ఓడిపోయిన హైదరాబాద్… ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని… కష్టపడుతోంది. దానికి తగ్గట్టుగానే మొన్నటి మెగా వేలంలో కీలక ప్లేయర్లను కొనుగోలు చేసింది హైదరాబాద్ ఓనర్ కావ్య పాప ( Hyderabad owner Kavya Maran). ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, రాహుల్ చౌహార్ లాంటి కీలక ప్లేయర్లు… కొత్తగా జట్టులోకి వచ్చారు. దీంతో హైదరాబాద్ జట్టు గతంలో కంటే బలంగా కనిపిస్తోంది.
ఇది ఇలా ఉండగా…. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ల పేర్లతో… హైదరాబాద్ ఏరియాల పేర్లను పోల్చుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అభిమానులు. కూకట్పల్లి క్లాసన్, హైటెక్ సిటీ హెడ్, పంజాగుట్ట ప్యాట్ కమిన్స్, ఖైరతాబాద్ కిషన్, హఫీజ్ పేట హర్షల్, జూ పార్క్ జంపా, అబిడ్స్ అభిషేక్ శర్మ , ఉప్పల్ unadkat, చార్మినార్ చాహల్, నాగోల్ నితీష్ కుమార్ రెడ్డి అంటూ హైదరాబాద్ క్రికెటర్ల పేర్లను… హైదరాబాదులోని ఏరియా పేర్లతో పోల్చుతున్నారు. అదే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప ను కూడా.. ఇది తరహాలో… పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు.
Kphb కావ్య పాప అంటూ… కామెంట్స్ చేస్తున్నారు. దీంతో… హైదరాబాద్ జట్టుకు మంచి ప్రచారం దొరుకుతుంది. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో… మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కత్తా నైట్ రైడర్స్ ( Royal Challengers Bangalore vs Kolkata Knight Riders ) మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత మార్చి 23వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) మధ్య ఫైట్ ఉండనుంది. ఈ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం ( Uppal Stadium in Hyderabad ) వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association). అటు టికెట్లు కూడా ఇప్పటికే.. సోల్డ్ అవుట్ అయ్యాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">