E-Paper
Advertisement

Guntur Kaaram : ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్‌లో మరో హీరోయిన్.. ఆమె ఎవరంటే?

Guntur Kaaram : ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్‌లో మరో హీరోయిన్.. ఆమె ఎవరంటే?
Advertisement

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘గుంటూరు కారం’ మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్‌లో ఫుల్ జోష్ నింపాయి. ఇక రీసెంట్‌గా రిలీజైన సాంగ్‌కి థియేటర్ దద్దరిల్లిపోతుందనే చెప్పాలి. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే ఈ సాంగ్‌లో మహేశ్ ఎనర్జీ.. శ్రీలీల మాస్ స్టెప్పులు థియేటర్ ఈళలు, కేకలతో మారుమోగిపోతుందనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సాంగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది.

ఈ సాంగ్‌లో కేవలం శ్రీలీల, మహేశ్ మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూడా ఉందని తెలుస్తోంది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయానికొస్తే.. ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ ప్రోమోతోనే సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ ప్రోమోపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తే.. మరికొందరు మాత్రం విమర్శలు చేశారు. ఎంతో క్లాస్‌గా కనిపించే మహేశ్ బాబు తన సినిమాల్లో ఇలాంటి పదం వాడడం ఏంటి? తెలుగు భాష, సాహిత్యానికి ఎంతగానో గౌరవం ఇచ్చే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటలో ఇలాంటి లిరిక్స్ ఉండడానికి ఎలా ఒప్పుకున్నాడు? అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

మరోవైపు మహేశ్ అభిమానుల నుంచి ఈ సాంగ్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ శనివారం ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా మహేశ్ మాస్ స్టెప్పులు వేయడం, ఆయన ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ బాగున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ లిరికల్ వీడియోలో శ్రీలీల, మహేశ్ బాబు మాత్రమే కనిపించారు. కాబట్టి సాంగ్ అంతా వీళ్లిద్దరి మధ్య ఉంటుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సాంగ్‌లో మరో హీరోయిన్ కూడా కనిపించబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘‘రాజమండ్రి రాజమందిరి.. మా యమ్మ పేరు తలవనోరు లేరు మేస్త్రి..’’ ఈ లిరిక్స్ శ్రీలీల మీద కాదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మెయిన్ సాంగ్ అంతా శ్రీలీల మీదనే ఉంటుంది. కానీ.. టేక్ ఆఫ్ మాత్రం మరో హీరోయిన్ పూర్ణ మీద ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తాజాగా బయటకు వచ్చి.. అందరిలో ఫుల్ జోష్ నింపింది. ఈ సర్ప్రైజ్‌ను చిత్రబృందం ఎంత సైలెంట్‌గా ఉంచినా.. బయటకు వచ్చి వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. దీని తర్వాత మహేశ్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ ఫాంటసీ మూవీలో నటించనున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×