BigTV English

New Year: న్యూ ఇయర్ వేడుకలు.. అలా చేస్తే అంతే సంగతి!

New Year: ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు పబ్బులు, బార్లు, ఈవెంట్లు.. గెట్ రెడీ అంటున్నాయి. అయితే సెలబ్రేషన్స్ పేరిట చట్టాన్ని ఉల్లంఘిస్తే లైఫ్‌ రిస్క్‌లో పడటం పక్కా అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

New Year: న్యూ ఇయర్ వేడుకలు.. అలా చేస్తే అంతే సంగతి!

New Year: ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు పబ్బులు, బార్లు, ఈవెంట్లు.. గెట్ రెడీ అంటున్నాయి. అయితే సెలబ్రేషన్స్ పేరిట చట్టాన్ని ఉల్లంఘిస్తే లైఫ్‌ రిస్క్‌లో పడటం పక్కా అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ నిబంధనలు అతిక్రమించినా, చట్టాన్ని ఉల్లంఘించినా కటకటాల పాలవ్వక తప్పదని పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల నిఘా మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో జరిగే వేడుకలపైనే ఉంది.


ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఏం చేయాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిందులు, విందులు.. జిగేల్ మనే లైట్లు, డీజే మోతలు, బాణా సంచా కాలుస్తూ ఓ రేంజ్ లో సందడి చేస్తారు యువత. సెలబ్రేషన్స్ ఓకే.. కానీ కండీషన్లు అప్లై అంటున్నారు పోలీసులు.

న్యూయర్ వేడుకలకు ఎప్పుడూ లేని విధంగా పోలీసు యంత్రాంగం ప్రత్యే నిఘా పెట్టింది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే రైడ్స్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి 8 గంటల నుంచి విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు. ఇక డ్రంకెన్ డ్రైవ్‌‌లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక డ్రగ్స్ తీసుకునే వారిపై నిఘా పెట్టేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు.


ఇక న్యూయర్ వేడుకలపై విశాఖ సీపీ క్రాంతి రానా టాటా అప్రమత్తమయ్యారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై వాహనాల నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో వాహనాలకు నో ఎంట్రీ. అర్థరాత్రి ఒంటిగంటలోపే న్యూ ఇయర్ వేడుకలు ముగించాలని తెలిపారు. సంబరాలు పేరిట చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైజాగ్ సిటీలో సెక్షన్ 30 అమలులో ఉందన్నారు.

హైదరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్లపై ఇవాళ రాత్రి 10 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. పాసులు ఉన్న వాహనాలకే శంషాబాద్ విమానాశ్రయం వెళ్లేందుకు ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతిస్తారు. పబ్, క్లబ్లుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపే కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×