E-Paper
Advertisement

Hanu Man : మాట నిలబెట్టుకున్న హనుమాన్ టీం.. అయోధ్య రామయ్యకు రూ. 14.25 లక్షల విరాళం..

Hanu Man : హనుమన్ సినిమా ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది . ప్రతి టికెట్‌పై రూ. 5 చొప్పున విరాళం సేకరించి విరాళం ఇస్తామని ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు. సినిమా ప్రదర్శితమైనంత కాలం విరాళం ఇవ్వనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. విరాళాలకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌ రూపొందించి అందులో పొందుపరుస్తామని నిర్మాత నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Hanu Man : మాట నిలబెట్టుకున్న హనుమాన్ టీం..  అయోధ్య రామయ్యకు  రూ. 14.25 లక్షల విరాళం..
Advertisement

Hanu Man : హనుమాన్ సినిమా ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షల రూపాయలను అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది . ప్రతి టికెట్‌పై రూ. 5 చొప్పున విరాళం ఇస్తామని ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించారు. సినిమా ప్రదర్శినన్ని రోజులు విరాళం ఇవ్వనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. విరాళాలకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌ రూపొందించి అందులో పొందుపరుస్తామని నిర్మాత నిరంజన్‌రెడ్డి తెలిపారు.

జాంబీరెడ్డి సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.. తేజ సజ్జా కాంబినేషన్‌లో హను-మాన్‌ మూవీని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్‌టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అమృత అయ్యర్‌ హిరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కోటి అనే వానర పాత్రకు హీరో రవితేజ వాయిస్‌ ఓవర్‌ అందించారు. రాష్ట్రవాప్తంగా 11న ప్రీమియర్ షో లను ప్రదర్శించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×