BigTV English

HanuMan: హనుమాన్‌కు బీభత్సమైన ప్రీమియర్ షోలు.. కలెక్షన్స్ అదుర్స్..!

HanuMan: హనుమాన్‌కు బీభత్సమైన ప్రీమియర్ షోలు.. కలెక్షన్స్ అదుర్స్..!

HanuMan: క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘హనుమాన్’. మొదటి నుంచే ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. తొలి టీజర్‌తోనే ఈ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాడు దర్శకుడు ప్రశాంత్. ఇక అప్పటి నుంచి ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్‌తో ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇలా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఓ రేంజ్ రెస్పాన్స్‌ను క్రియేట్ చేశాయి. భారీ అంచనాల నడుమ ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలకు ముందు రోజే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, యూఎస్‌లో పెయిడ్ ప్రీమియర్‌ షోలు పడ్డాయి.


కాగా ఈ మూవీకి ఓ రేంజ్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. దేశవ్యాప్తంగా 1000 పైగా ప్రీమియర్ షోలు పడ్డాయి. అంతేకాకుండా అన్ని ఫిల్ అవ్వడం గమనార్హం. ఇక వీటిలో 280 పైగా షోలు ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫిల్ అయ్యిపోయాయి. ఇక హైదరాబాద్‌లో పెయిడ్ ప్రీమియర్ షోస్ ద్వారా బుధవారం రాత్రికి రూ.1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో మిగతా జిల్లాలతోపాటు సీడెడ్, ఆంధ్ర, బెంగళూరు కలిపి పెయిడ్ ప్రీమియర్స్‌కు రూ.3 కోట్ల వరకు కలెక్షన్స్ ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

దీంతోపాటు అమెరికాలో కూడా ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు సూపర్ గానే పడ్డాయి. అక్కడ కేవలం ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం 250 వేల డాలర్స్‌కు పైగా కలెక్షన్స్‌ని రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమాకి వస్తున్న బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ చూస్తుంటే.. తేజ సజ్జకి అమెరికాలో మొదటి 1M మూవీ దొరికేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రం 100 కోట్ల మార్క్ అందుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×