E-Paper
Advertisement

Hanuman Movie @ Zee5: ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ సినిమా!

Hanuman Movie @ Zee5: ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ సినిమా!
Advertisement

Hanuman OTT Release

Hanuman Streaming in Zee5 OTT Platform: హనుమాన్ .. స్టార్ హీరోలు ఇందులో నటించలేదు. స్టార్ డైరెక్టర్ తెరకెక్కించ లేదు. భారీ బడ్జెట్ పెట్టలేదు. కానీ పాన్ ఇండియా మూవీగా వచ్చి హనుమాన్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ యావత్ భారత్ దేశవ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు మారు మోగేలా చేసింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. యావత్ దేశాన్ని ఊపేసింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది.

Advertisement

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి 10 రోజుల ముందు హనుమాన్ థియేటర్లలో విడుదలైంది. అప్పటికే దేశంలో శ్రీరామ నామ స్మరణ జరుగుతోంది. ఈ అంశం కూడా ఈ సినిమాకు ఆదరణ పెంచేలా చేసింది. అందుకే అంతటి ఘన విజయాన్ని అందుకుంది. తెలుగురాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లోనూ కనక వర్షం కురిపింది.

హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అని ప్రేక్షకులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ తెరపడింది. జియో సినిమాలో శనివారం రాత్రి 8 గంటల నుంచి హనుమాన్ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మూవీ హిందీలో అందుబాటులో ఉండటంపై ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్లైమాక్స్ విజువల్స్ షేర్ చేసి మరి తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ మూవీలో హీరోగా నటించిన తేజ సజ్జా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Also Read: ఘనంగా వెంకటేశ్ కూతురి పెళ్లి.. ఫొటోలు వైరల్

అలాగే జీ5లోకి హనుమాన్ అందుబాటులోకి వచ్చింది. కానీ షరతులు వర్తిస్తాయి. సబ్ స్క్రిప్షన్ ఉన్నా చూడలేరు. ఈ మూవీ చూడాలంటే జీ5లో డబ్బులు చెల్లించాలి. దీనిపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హనుమాన్ తెలు వెర్షన్ ఇంకా ఓటీటీలోకి రాకపోవడంపై టాలీవుడ్ ప్రేక్షకులు ఆగ్రహంగా ఉన్నారు. దక్షిణాది భాషల్లో ఎప్పుడు ఓటీటీల్లోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. హనుమాన్ మూవీని యువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. సూపర్ హీరో స్టోరికి పురాణాన్ని లింకు చేసి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాడు. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. వెన్నెల కిషోర్ కామెడీతో నవ్వించాడు. వినయ్ రాయ్ తనదైన విలక్షణ నటనతో మెప్పించాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×