E-Paper
Advertisement

Election Code Rules: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే ఇక అంతే?

Election Code Rules: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే ఇక అంతే?
Advertisement
Election Code
Election Code

Election Code Rules: ఆ… ఆగడాగండి…
ఈ విషయం చెప్పే ముందు ఒక ఉదాహరణ చెబుతాను.
మీకు అర్జంటుగా ఒక అవసరం వచ్చింది.
ఒక రూ.50 వేలు కావాలి…
వెంటనే ఫ్రెండు, కజిన్ ఎవరినో అడిగారు..
లేదా ఇంట్రస్ట్ కి ఒకరి దగ్గర తీసుకుందామని అనుకున్నారు.
వాళ్లు క్యాష్ ఇచ్చారు…
మీరు ఎంచక్కా డబ్బులు జేబులో పెట్టుకుని
బైక్ మీద విజిల్ వేసుకుంటూ వెళుతున్నారు.

దారిలో పోలీసులు ఆపారు.
బండి లైసెన్స్ అని మీరనుకున్నారు.
కానీ వాళ్లు మీ జేబులో ఉన్న డబ్బులు ఎక్కడివి?
అని అడిగారు…
ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానని అన్నారు…
ఎవరా ఫ్రెండు? ఆధారం ఏది? అన్నారు…
మీ దగ్గర ఆన్సర్ లేదు…
పోలీసులకి డౌట్ వచ్చింది.
ఎందుకంటే ఆ డబ్బులేమైనా పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి తెచ్చేస్తున్నావేమోనని అనుమాన పడ్డారు.
మీ ఫ్రెండు పేరేమిటి? అని అడిగారు…
మీ గుండెలు జారిపోయాయి..
వాడి పేరు చెప్పాలి…
వాడికెక్కడి నుంచి వచ్చాయో వాడు చెప్పాలి.
మొత్తం నీ వివరాలు, నీకు డబ్బులిచ్చిన పాపానికి వారి వివరాలు… మొత్తం పుట్టంతా కదిపేసి వదిలేస్తారు.

Advertisement

Also Read: Rahul Gandhi Bharat Jodo Yatra: ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. నేడు భారీ బహిరంగ సభ!

ఇదంతా ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
మీ వద్ద రూ.50 వేలకు మించి ఉంటే, మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది.

Advertisement

ఒకవేళ బ్యాంకుల నుంచి డ్రా చేసి తీసేటప్పుడు కూడా ఆ రిసీప్ట్ లు అవీ జాగ్రత్తగా పెట్టుకోండి. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, ఫంక్షన్లు చేసుకుంటే ముందుగానే ఎస్పీ ఆఫీసులో లెటర్ ఇచ్చి, పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆసుపత్రిల్లో రోగులు ఉంటే, వారికి చెందిన ఓపీ బిల్లులు దగ్గర పెట్టుకోవాలి. అప్పుడే డబ్బులు జేబులో పెట్టుకు తిరగాలి.

ఇదంతా ఎందుకంటే రాజకీయ పార్టీలు అప్పుడే డబ్బులను సంచుల్లో కుక్కి రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలు, పల్లెలు దాటించేస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని ఆపడానికి అందరూ శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు క్యాష్ తో వెళ్లడం రిస్క్. అందుకే కోరి రిస్క్ తెచ్చుకోవద్దని పోలీసులు కోరుతున్నారు.

Also Read: Lok Sabha Elections 2024: ఈసీ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీలు మార్పు..

ఇలా దొరికిన సొమ్మును జిల్లాస్థాయిలో ఉండే కమిటీకి అప్పగిస్తారు. జిల్లా పరిషత్ సీఈవో ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉంటారు. వారెదురుగా నిలబడి, గంటలు గంటలు ఎదురుచూసి, వారు అడిగే లక్షా తొంభై ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.
ఆధారాలన్నీ ఉంటేనే, నగదు, డబ్బులు తిరిగిస్తారు. లేదంటే కృష్ణార్పణం అని వదిలేసుకోవాలి.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×