BigTV English

HanuMan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘హనుమాన్‌’.. అయోధ్య రామమందిరానికి కోట్లలో విరాళం..

HanuMan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘హనుమాన్‌’.. అయోధ్య రామమందిరానికి కోట్లలో విరాళం..

HanuMan: హనుమాన్ మూవీ యూనిట్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు హనుమాన్ సినిమాకు అమ్ముడైన టికెట్లపై రూ.5 చొప్పున వసూళైన మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా అందజేసింది. మరి ఈ సినిమాకు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక్కో టికెట్ మీద రూ.5 చొప్పున మొత్తం ఎంత అమౌంట్ కలెక్ట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.


క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా, అమృతా అయ్యర్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘హనుమాన్‌’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజై బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మన దేశంలోనే కాక విదేశాల్లో సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. సినిమా విడుదలై వారంపైనే అవుతోన్నా.. ఇప్పటికి కూడా థియేటర్ల వద్ద హౌజ్‌ఫుల్‌ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఇక విదేశాల్లో ఇప్పటికే 5 మిలియన్ల క్లబ్‌లో చేరగా.. మన దగ్గర రూ.150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని మేకర్స్ తెలిపారు.

ఇదంతా ఒకెత్తయితే.. హనుమాన్‌ సినిమా విడుదల సందర్భంగా.. ఈ సినిమాకి సంబంధించి ప్రతి టికెట్‌ మీద రూ.5 అయోధ్య రామ మందిరానికి విరాళం ఇస్తామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాటను చిత్రబృందం తాజాగా నెరవేర్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు అమ్ముడైన టికెట్ల మీద రూ.5 చొప్పున దాదాపు 2 కోట్ల 66 లక్షల 41 వేల 055 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చినట్లు హనుమాన్‌ టీమ్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈసినిమాకు 53,28,211 టికెట్లు అమ్ముడయ్యాని.. ఒక్కో టికెట్‌ మీద రూ.5 చొప్పున.. మొత్తం 2,66,41,055 కోట్ల రూపాయలు అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చామని తెలిపారు. దీని బట్టి చూస్తే హనుమాన్ మూవీ టికెట్లు ఏ రేంజ్‌లో అమ్ముడవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×