BigTV English

Nidhi Agarwal : అందాల నిధి.. వీరమల్లు లుక్కు ఇది.. వైరల్ గా మారిన నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్

Nidhi Agarwal : అందాల నిధి.. వీరమల్లు లుక్కు ఇది.. వైరల్ గా మారిన నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్

Hari Hara Veera Mallu team released first look of Nidhi Agarwal: టాలీవుడ్ హాట్ అండ్ క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా అవేమీ నిధికి గుర్తింపు తీసుకురాలేదు. తెలుగులో తొలి సారి నాగచైతన్యతో కలిసి సవ్యసాచి సినిమా చేసింది. అయితే సవ్యసాచి యావరేజ్ సినిమాగా ఆడింది. వెంటనే అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను మూవీ చేసింది. అది కూడా ఫెయిల్ అయింది. ఇలా అక్కినేని హీరోలతో చేసిన రెండు సినిమాలూ ఫ్లాపవడంతో నిధి కెరీర్ డేంజర్ జోన్ లో పడింది. దీనితో నిధికి టాలీవుడ్ లోనూ చుక్కెదురయింది. అయితే అనుకోకుండా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో రామ్ సరసన నటించింది. ఆ మూవీ హిట్ కావడంతో నిధికి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు తలుపు తడతాయని భావించారంతా. ఇస్మార్ట్ శంకర్ మూవీ లో ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచి యూత్ లో క్రేజ్ పెంచుకుంది.


కోలీవుడ్ లోనూ అంతంత మాత్రం

టాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ లో తన లక్కును పరీక్షించుకుంది. అక్కడా ఈ బ్యూటీకి కలిసిరాలేదు. సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఊహించని అవకాశం లభించింది ఈ ఇస్మార్ట్ బ్యూటీకి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏపీ రాజకీయాలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు షెడ్యూల్స్ ఇవ్వకపోవడంతో సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దాదాపు నాలుగేళ్లవుతోంది. ఈ మూవీపైనే ఎన్నో హోప్స్ పెట్టుకున్న నిధి అగర్వాల్ సినిమా ఆగిపోవడంతో తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయింది. నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు. హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ ఈ మూవీ నిర్మాణం ఆగిపోలేదని హింట్ ఇస్తూ పవన్ ఫ్యాన్స్ కు కుషీ ఇచ్చారు. నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ ను శనివారం రిలీజ్ చేశారు.


వీరమల్లు ఆగదు

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే షూటింగ్ లో పాల్గొని తనకి సంబంధించిన పార్ట్ పూర్తిచేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకాయి. దీనికి తోడు నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మహారాణి గెటప్ లో అందానికే అసూయ పుట్టించేలా ఉన్న నిధి అగర్వాల్ లుక్ చూసి నెటిజన్లు అంతా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అసలు షూటింగే ఆగిపోతుంది అనుకున్న హరిహర వీరమల్లు ఫ్యాన్స్ కు ఇప్పుడు బంగారు నిధి దొరికినట్లయిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్

యంగ్ అండ్ బ్యూటిఫుల్ అమేజింగ్ నటికి బర్త్ డే విషెస్ అంటూ పోస్టింగులు పెడుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాతైనా నిధి అగర్వాల్ ఫేట్ మారుతుందా అని కొందరు కామెంట్స్ పెడుతుంటే..వీరమల్లు మూవీ నిధి అగర్వాల్ కు మంచి బ్రేక్ ఇస్తుందని.. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తుతాయని అంతా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ ట్రెండింగ్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×