BigTV English

Harish Shankar: హరీష్ శంకర్ ను అవమానించిన ఛోటా.. వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్

Harish Shankar: హరీష్ శంకర్ ను అవమానించిన ఛోటా.. వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్

Harish Shankar: ఒక సినిమా తీసేటప్పుడు 24 క్రాఫ్ట్స్ ఒక్కటిగా కలిసి పనిచేస్తేనే అది విజయవంతం అవుతుంది. ఇక ఆ క్రాఫ్ట్స్ లో పనిచేసేవారి మధ్య అప్పుడప్పుడు విబేధాలు వస్తూ ఉంటాయి. కొంతమంది సినిమా తరువాత వాటిని మర్చిపోతారు. ఇంకొంతమంది వాటిని గుర్తుచేసుకొని మిగతావారిని అవమానిస్తూ ఉంటారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు వివాదాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలో కనపడడం ఆలస్యం ఎక్కడివో, ఎవరివో అవసరం లేకుండా కూడా మాట్లాడి వివాదాలను కొనితెచ్చుకుంటాడు.


తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ పై ఛోటా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. రామయ్య వస్తావయ్యా సినిమాకు హరీష్ శంకర్ చాలా అడ్డుపడ్డాడు అని, అది కాదు, ఇది కాదు.. ఇలా పెట్టాలి అంటూ చెప్పేవాడు. నేను చాలా ప్రయత్నించా చెప్పడానికి అతడు వైన్ మూడ్ లో ఉండడం లేదు. దీంతో చేసేదేమి లేక అతను ఏదంటే అది అంటూ వదిలేశాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ. హరీష్ ఛోటాకు బహిరంగ లేఖ రాసుకొచ్చాడు. తనను అవమానించడం కరెక్ట్ కాదు అని, అనవసరంగా కెలుక్కుంటున్నావు అంటూ కొద్దిగా ఘాటుగానే చెప్పుకొచ్చాడు.

(వయసులో పెద్ద కాబట్టి )గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ…. రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ ని తీసేస్తున్నాడు… అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే “గబ్బర్ సింగ్” వచ్చినప్పుడు నాది “రామయ్య వస్తావయ్య” వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా. కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది.


మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి.ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే.. ఏ రోజైనా.. ఏ ప్లాట్ ఫార్మ్ అయినా నేను ఎదురుచూస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Harish Shankar Tweet
Harish Shankar Tweet

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×