Big Stories

Sukesh Chandrasekhar: BRS ఆఫీస్ నుంచే అంతా జరిగింది.. జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ

Sukesh Chandrasekhar: మండోలి జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశాడు. గతంలో జరిగిన నెయ్యి డబ్బాల వ్యవహారంపై లేఖలో పేర్కొన్నాడు. అరవింద్ కేజ్రీవాల్, కవిత, సత్యేంద్ర జైన్ ల గురించి కూడా అందులో ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

నెయ్యి కోడ్ లాంగ్వేజ్ ద్వారానే ముడుపులు చేతులు మారాయని లేఖలో ప్రస్తావించాడు. అయితే, నగదు సేకరణ మొత్తం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి జరిగిందని, కవిత సహకారంతోనే ఈ వ్యవహారమంతా జరిగిందని, ఇందుకు సంబంధించిన అతని వద్ద ఆధారాలు ఉన్నాయంటూ సుఖేష్ తెలిపాడు.

- Advertisement -

కవిత, అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, తన మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను మీకు జత చేసి పంపిస్తున్నానంటూ హోం శాఖకు రాసిన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు.

కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఈ స్క్రీన్ షాట్లను జతపరుస్తున్నానన్న సుఖేష్ చంద్రశేఖర్.. అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ నేతృత్వంలోని ఆప్ సిండికేట్‌కు సంబంధించి తన దగ్గర ఉన్న పూర్తి సాక్ష్యాలతో తన సహకారాన్ని అందిస్తానంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో ప్రస్తావించాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News