Vivek Athreya To Hasith Goli : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్‌లో శ్రీ విష్ణు ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు శ్రీ విష్ణు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన మెంటల్ మదిలో అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత మంచి గుర్తింపు సాధించుకొని మెల్లమెల్లగా హీరో గానే సినిమాలు చేయటం మొదలు పెట్టాడు శ్రీ విష్ణు. వేణు ఉడుగుల దర్శకుడిగా పరిచయమైన నీది నాది ఒకే కథ సినిమా విష్ణు కి మంచి బ్రేక్ ఇచ్చింది. అలానే వేణుని కూడా దర్శకుడుగా స్థిరపరిచింది.
ఇంక తన కెరియర్ లో ప్రస్తుతం చాలా విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు శ్రీ విష్ణు. ఒక టైం లో శ్రీ విష్ణు వరుసగా సినిమాలు చేస్తూ వరుస డిజాస్టర్స్ చూశాడు. మళ్ళీ సామజవరగమన సినిమాతో మంచి హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా దాదాపు 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాను మినీ నువ్వు నాకు నచ్చావ్ అంటూ కూడా కొంతమంది ప్రశంసించారు.
Also More : ఏంటి పాప ఇది.. టాప్ సీక్రెట్ ను బయటపెట్టేసిందిగా..?
రీసెంట్ గా శ్రీ విష్ణు హసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ సినిమాను చేశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ అయితే సాధించలేకపోయింది. కానీ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలామంది ఈ సినిమాను ఆదరించారు. ఇంత మంచి సినిమాను ఎలా ఫెయిల్ చేశారు అని కొన్ని పోస్ట్స్, తెలుగు సినిమా ఫెయిల్డ్ హియర్ అంటూ మరికొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అని చెప్పాలి.
ఇకపోతే శ్రీ విష్ణు సినిమాల్లో సెన్సార్ కూడా కనిపెట్టని కొన్ని బూతులు ఉంటాయి. చాలా రోజులు తర్వాత అవి తవ్వకాల్లో బయటపడతాయి. ఇక స్వాగ్ సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి వైరల్ అయింది. అయితే ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ షేర్ చేస్తూ కొంత మంది డి కోడ్ చేయడం మొదలు పెడుతూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లిరిక్స్ ని రాసుకొచ్చారు. అవి ఎంత బూతులా ఉండేవో చాలామందికి తెలిసిన విషయమే. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో దాని గురించి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు హసిత్ గోలి. వాస్తవానికి అవి సంస్కృతంలోని పదాలు. అయితే వాటిని ట్రోలర్స్ వేరే విధంగా చేసేశారు. దీనికి దర్శకుడు వివేక ఆత్రేయ స్పందిస్తూ వాళ్ల వెర్షనే బాగుందంటూ ఆ ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చాడు.
Also Read : అల్లు అర్జున్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.. సంబరపడుతున్న పుష్ప ఫ్యాన్స్