India U19 vs Pakistan U19: టీమిండియా ( Team India ) వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan ) జట్ల మధ్య మ్యాచ్ అంటే అందరూ ఎగబడి చూస్తారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే… ఇండియా ( Team India ) అలాగే పాకిస్తాన్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు… ఆసక్తి కనబరిస్తారు. అందుకే ఇక్కడ ఇండియా ( Team India ) వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన జనాలు టీవీల ముందే కూర్చుంటారు. ఈ మధ్యకాలంలో టీమిండియా ( Team India ) వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు పెద్దగా జరగలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో.. ఇవాళ టీం ఇండియా ( Team India ) వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఓ మ్యాచ్ జరగబోతోంది.
Also Read: RCB: వివాదంలో RCB.. బ్యాన్ చేయాలంటూ కన్నడీల డిమాండ్ ?
అది కూడా అండర్ 19 ఆసియా కప్ లో ( ACC U19 Asia Cup, 2024 ) భాగంగా టీం ఇండియా ( Team India ) వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఇవాళ ఆసియా కప్ అండర్ 19 ఆసియా కప్ లో భాగంగా రెండు దాయాది దేశాల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇక టీమిండియా కు ( Team India ) మహమ్మద్ అమన్ ( Mohammed AMAN ) కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అటు టీమిండియా జట్టులో ఐపీఎల్ వండర్ 13 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) కూడా ఉండడం గమనార్హం.
Also Read: Young Cricketer Died: మహారాష్ట్రలో విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి !
అండర్ 19 ఆసియా కప్ లో ( ACC U19 Asia Cup, 2024 ) రెండు జట్లు ఇప్పటివరకు మూడుసార్లు పోటీ పడ్డాయి. అయితే ఇందులో టీమిండియాదే ( Team India ) పైచేయి కావడం గమనార్హం. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే మూడు మ్యాచ్ లు జరిగితే రెండు మ్యాచ్లు టీమిండియా విజయం సాధించింది. అటు పాకిస్తాన్ ఒకసారి విజయం సాధించడం మనం చూశాం. ఇక టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ మ్యాచ్ ను సోనీ స్పోర్ట్స్ లో.. చూడవచ్చు. జియో లాంటి లాంటి ఫ్లాట్ ఫాoలలో ఈ మ్యాచ్ రాదన్నమాట. ఇక ఇప్పటికే ఆసియా కప్ అండర్ 19 ఛాంపియన్ గా 8 సార్లు విజయం సాధించింది టీమిండియా ( Team India ). ఇప్పుడు టీమిండియా ( Team India ) తొమ్మిదవ టైటిల్ కోసం బరిలోకి దిగింది.
పూర్తి స్క్వాడ్‌లు:
భారత U19 జట్టు: హార్దిక్ రాజ్, వైభవ్ సూర్యవంశీ, ప్రణవ్ పంత్, KP కార్తికేయ, హర్వాన్ష్ సింగ్(w), మహమ్మద్ అమన్(c), ఆయుష్ మ్హత్రే, సమర్థ్ నాగరాజ్, నిఖిల్ కుమార్, యుధాజిత్ గుహ, చేతన్ శర్మ, కిరణ్ చోర్మలే, అనురాగ్ కవాడే, ఆండ్రీ సిద్దార్థ్ సి, మహ్మద్ ఈనాన్
పాకిస్తాన్ U19 జట్టు: మహ్మద్ తయ్యబ్ ఆరిఫ్, ఫర్హాన్ యూసఫ్, షాజైబ్ ఖాన్, సాద్ బేగ్(w/c), హరూన్ అర్షద్, అలీ రజా, అహ్మద్ హుస్సేన్, మహ్మద్ రియాజుల్లా, ఉస్మాన్ ఖాన్, అబ్దుల్ సుభాన్, ఫహమ్-ఉల్-హక్, మహ్మద్ హుజైఫా, ఉమర్ జైబ్, మహ్మద్ అహ్మద్, నవీద్ అహ్మద్ ఖాన్