BigTV English

Heroine Rambha: రంభ కూతురును చూశారా.. హీరోయిన్లు కూడా చాలరు.. ఎంత అందంగా ఉందో

Heroine Rambha: రంభ కూతురును చూశారా.. హీరోయిన్లు కూడా చాలరు.. ఎంత అందంగా ఉందో

Heroine Rambha: సీనియర్ హీరోయిన్ రంభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె అందం, అభినయం, గ్లామర్ ఇప్పటికీ కుర్రాళ్ళు మర్చిపోలేరు అంటే అతిశయోక్తికాదు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రంభ.


ఇక మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామ  తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సీనియర్, జూనియర్ అని లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ చేసి మెప్పించింది.  తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక దాదాపు 100 సినిమాలకుపైగా నటించి మెప్పించిన రంభ.. 2010 లో బిజినెస్ మ్యాన్ ఇంద్ర కుమార్ ను వివాహామాడి సినిమాలకు దూరమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి.

పిల్లలను చూసుకుంటూనే కొన్ని షోస్ కు జడ్జిగా వ్యవహరించి అభిమానులను అలరించింది. అంతేనా.. దేశముదురు, యమదొంగ లాంటి సినిమాలో హాట్ ఐటెంసాంగ్స్ చేసి ఔరా అని అనిపించింది. ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె కుటుంబంతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది.నిత్యం తమ ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే రంభ.. తాజాగా కుటుంబంతో కలిసి గురువాయూర్ ఆలయాన్ని సందర్శించింది.


ఆమెతో పాటు భర్త ఇంద్ర, ముగ్గురు పిల్లలు, కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ కూడా ఉంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అందులో అందరి చూపు రంభ పెద్ద కూతురు లాన్య ఇంద్రకుమార్ మీదనే పడ్డాయి. తల్లికి తగ్గ తనయ. అందంలో తల్లిని మించిందా అన్నట్లు కనిపించింది. నిండుగా చుడీదార్ వేసుకొని తల్లి పక్కన కనిపించింది. సడెన్ గా చూసి వీరిద్దరూ అక్కాచెల్లెళ్లేమో అని అనుమానపడ్డ ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం చదువు మీద దృష్టి పెట్టిన లాన్య .. పెద్దయ్యాక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×