BigTV English

Nag Ashwin: అదేంటి నాగీ మావా అంత మాట అన్నావ్.. ఎంత ఊహించుకున్నామో తెలుసా..?

Nag Ashwin: అదేంటి నాగీ మావా అంత మాట అన్నావ్.. ఎంత ఊహించుకున్నామో తెలుసా..?

Nag Asgwin: నాగ్ అశ్విన్ .. నాగ్ అశ్విన్.. ఈ పేరు గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి అయితే.. ఆయనలానే.. తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. మహానటి సినిమాతోనే తన సత్తా నిరూపించిన నాగీ.. ఇప్పుడు కల్కి సినిమాతో మరోసారి తెలుగు డైరెక్టర్ పవర్ చూపించాడు.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి2898ad జూన్ 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకూ 700 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. మైథలాజికల్ కు సైన్స్ ఫిక్షన్ జోడించి నాగీ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

మహాభారతం అంటే ఏంటో కూడా తెలియని యువత.. కల్కి చూసాక.. శ్రీకృష్ణుడు, కర్ణ, అశ్వత్థామ, అర్జునా ఎవరు అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కల్కి సినిమా మొత్తంలో హైలైట్ గా నిలిచింది శ్రీకృష్ణుడు. ముఖం చూపించకపోయినా.. ఆ క్యారెక్టర్ కు ఉన్న పవర్ మరెవరికి రాలేదు . సినిమామొత్తంలో శ్రీకృష్ణుడు పాత్ర కొద్దిగా ఉన్నా కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.


ఇక సెకండ్ పార్ట్ లో శ్రీకృష్ణుడు ఎక్కువ ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో ఆ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు కానీ, మరో పెద్ద హీరోను కానీ చూపిస్తే బావుంటుందని అభిమానులు కోరుతున్నారు. అయితే ఆశలను నాగీ అడియాశలు చేశాడు.

సెకండ్ పార్ట్ లో కూడా శ్రీకృష్ణుడు ముఖాన్ని చూపించమని, ఇప్పుడు ఎలాగైతే ముఖాన్ని చూపించలేదో.. కల్కి యూనివర్స్ మొత్తంలో కూడా అలాగే ఆ పాత్ర ఉండబోతుందని చెప్పి షాక్ ఇచ్చాడు. దీంతో అభిమానులు అదేంటి నాగీ మావా అంత మాట అన్నావ్.. ఎంత ఊహించుకున్నామో తెలుసా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే కల్కి పార్ట్ 2 మొదలుకానుందని నాగీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×