BigTV English

Ajith : సినిమాలకు అజిత్ గుడ్ బై..? ఆ ఒక్కటే కారణమా?

Ajith : సినిమాలకు అజిత్ గుడ్ బై..? ఆ ఒక్కటే కారణమా?

Ajith : తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు సినిమాలకు దూరం అవుతున్నారు. మొన్న విజయ్ దళపతి సినిమాలకు త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మరో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నాడనే వార్త కోలివుడ్ మీడియాలో కోడై కూస్తుంది.. సోషల్ మీడియలో ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో ప్రకంపనాలు సృష్టిస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదండి తమిళ స్టార్ హీరో అజిత్.. అసలు సినిమాలకు ఎందుకు దూరం అవ్వాలని అనుకుంటున్నాడో ఒకసారి చూసేద్దాం..


తమిళ స్టార్ హీరో అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేద.. ఆయన చేస్తున్న సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతుండటంతో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు చేస్తుంటాడు.. అందరికీ నచ్చేలా ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలను చేస్తాడు. అజిత్ గతంలో చేసిన సినిమాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. అందులో కొన్ని సినిమాలకు క్రేజ్ ఇప్పటికి తగ్గలేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో పలకరించే అజిత్ ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. అయితే తాజాగా ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే.. అజిత్ సినిమాల కు లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నాడని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం యురోపియన్ GT4 ఛాంపియన్‌షిప్. రేసింగ్‌ పై ఈ హీరోకున్న ఇష్టమేంటో అందరికీ తెలుసు. ఇందులో పాల్గొనడానికే ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేస్తున్నాడని టాక్. ఒక రెండేళ్ల పాటు ఆయన బ్రేక్ తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మీడియాలో ద్రావనంలా వ్యాపించి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అజిత్ రెండు సినిమాలను చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ, విడాముయార్చి లు 3 నెలల గ్యాప్‌లోనే రానున్నాయి. ఈ సినిమాలు రెండు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటివరకు మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నాడని టాక్.. ఇక వీటి తర్వాత ఒక్క సినిమాకు కూడా సైన్ చెయ్యలేదని తెలుస్తుంది.. రేసింగ్ కోసమేనా మారేదైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ వద్దని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అజిత్ బైక్ రేసర్ గా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×