Sreeleela: టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని అందుకుంది. ఒక్క సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించింది. ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన కూడా శ్రీలీల ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు. ఈమధ్య సినిమాలతో పాటు ఐటం సాంగ్ లో కూడా నటించి మెప్పించింది. ఆ సినిమాలో ఆ సాంగ్ హైలైట్ అవడంతో ఈ అమ్మడు క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. మరో సినిమాలో ఐటమ్ సాంగ్ అయిపోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈమె ఏ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుంది? హీరో ఎవరు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
పుష్ప 2 లో శ్రీలీల ఐటమ్ సాంగ్..
అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా పుష్ప.. ఈ మూవీ భారీ విజయనే అందుకున్న సందర్భంలో సీక్వెల్ గా రీసెంట్ గా పుష్ప 2 మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ సమంత స్టెప్పులు వేసింది. ఆ పాట యావత్ సినీ అభిమానులను ఒక ఊపు ఊపేసింది. రీసెంట్ గా వచ్చిన సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టింది. సినిమా వచ్చి ఆరు నెలలు అవుతున్న కూడా ఈ పాట మాత్రం ఇప్పటికే ట్రెండ్ అవుతూనే ఉంది.అయితే సమంత చూపించిన గ్రేస్ అండ్ హాట్ నెస్‌లో సగం కూడా శ్రీలీల మ్యాచ్ చేయలేకపోయిందని చాలామంది పెదవి విరిచారు. హీరోయిన్లతో ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్దానిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తాజాగా రామ్ చరణ్ మూవీలో కూడా శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..
పెద్ది మూవీలో శ్రీలీల ఐటమ్ సాంగ్..
ఈ ఏడాది భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు బుచ్చిబాబు కాంభోలో పెద్ది సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కు శ్రీలీలను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఫుల్ ఎనర్జిటిక్ మాస్ పాట ప్రేక్షకులకి పూనకాలు తెప్పించేలా ఉంటుందని అంటున్నారు. శ్రీలీల కూడా మంచి డ్యాన్సర్ కావడంతో ఇద్దరి స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు. శ్రీ లీలా మాస్ మహారాజా రవితేజ తో కలిసి మాస్ జాతర సినిమాలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంది.