Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈ నెల అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. నితిన్ .. ఈ నెలలోనే తండ్రి కాబోతున్నాడని సమాచారం. నాలుగేళ్ళ క్రితంనితిన్, షాలిని కందుకూరిని వివాహం చేసుకున్నాడు.
గతేడాది చివరిలోనే షాలిని ప్రెగ్నెంట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ నెల ఆమెకు 9 వ నెల కావడంతో.. సెప్టెంబర్ లోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో అభిమానులు నితిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నితిన్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నా.. విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు.
గతేడాది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ ఏడాది ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో తమ్ముడు, రాబిన్ హుడ్. ఈ రెండు కాకుండా మరో సినిమా సెట్స్ మీద ఉందని టాక్.
నితిన్ సైతం ఈ రెండు సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా తమ్ముడు సినిమాపైనే ప్రేక్షకుల అంచనాలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ హిట్ సినిమా అయినా తమ్ముడు టైటిల్ తో కొత్త సినిమా చేయడంతో పవన్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన కాంతార బ్యూటీ సప్తమి గౌడ నటిస్తోంది. అంతేకాకుండా చాలా గ్యాప్ తరువాత హీరోయిన్ లయ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలతో నితిన్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.