Hero Siddharth: సాధారణంగా కొంతమంది హీరోలు అనుకోకుండా చేసే వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తూ ఉంటాయి. ఆ తర్వాత తప్పు తెలుసుకొని క్షమాపణలు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఇప్పుడు సరిగా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కోలీవుడ్ హీరో సిద్ధార్థ్. అసలు విషయంలోకి వెళ్తే, టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘పుష్ప -2’ ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తోంది. ఒక టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సృష్టించిన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ సమయంలో రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా రికార్డు సృష్టించింది.
పుష్ప -2 అక్కసు వెల్లగక్కిన సిద్ధార్థ్..
ఒక పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యి దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను దేశవ్యాప్తంగా పలు నగరాలలో ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం పుష్ప ఈవెంట్ పైన హీరో సిద్ధార్థ్ (Siddharth) షాకింగ్ కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రమోషన్స్ లో భాగంగా బీహార్ లోని పాట్నాలో పుష్ప 2 టీజర్ లాంఛ్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దాదాపు రెండు లక్షలకు పైగా అభిమానులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ సక్సెస్ తో దేశంలోని పలు నగరాలలో కూడా ప్రమోషన్స్ ఈవెంట్ ను నిర్వహించారు. భారీ ఎత్తున అల్లు అర్జున్ (Allu Arjun)అభిమానులు ఈవెంట్ కు హాజరై సక్సెస్ చేశారు. ఇక ఈ ఈవెంట్ పైన తన అక్కసు వెళ్లగక్కాడు.. “మనదేశంలో జన సమీకరణ అనేది పెద్ద విషయం ఏమీ కాదు. అది మార్కెటింగ్ స్ట్రాటజీ..ఒక కన్స్ట్రక్షన్ దగ్గర జేసీపీ వర్క్ జరుగుతున్నా జనాలు గుమి కూడతారు, బిర్యానీ, క్వార్టర్ సీసా ఇస్తే చాలు పొలిటికల్ మీటింగ్ కి జనాలు ఎగబడతారు. పొలిటికల్ మీటింగ్స్ కి జనాలు వచ్చినంత మాత్రాన పార్టీలు గెలుస్తాయా? నమ్మకం లేని పరిస్థితులు. ఇండియాలో జనం గుమిగూడడం సహజమే. అది చాలా చిన్న విషయం” అంటూ పుష్ప -2 ట్రైలర్ ఈవెంట్ పై కామెంట్లు చేశారు సిద్ధార్థ్. ఇక ఈ విషయం చూసి నెట్టింట పలువురు నెటిజెన్స్, బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ చూసి కుళ్ళు కుంటున్నాడు. అందుకే ఇలాంటి కామెంట్లు చేశాడని పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసిన విషయం తెలిసింది.
బన్నీతో నాకు శత్రుత్వం లేదు..
ఇక రోజు రోజుకి నెగిటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించారు హీరో సిద్ధార్థ్. “అల్లు అర్జున్ తో నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. నేను అలా ఎందుకంటాను” అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికైతే గతంలో అనేసి ఇప్పుడు ఎందుకంటాను అంటూ మళ్ళీ ప్లేట్ తిప్పడంతో తన సినిమా విడుదల దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కామెంట్లు చేశారని బన్నీ ఫాన్స్ ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ ‘మిస్ యు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవంబర్ 29న విడుదల కావాల్సి ఉండగా డిసెంబర్ 13 కు విడుదల వాయిదా వేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే పుష్ప -2 పై అక్కసు వెళ్ళగక్కిన సిద్ధార్థ్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.