BigTV English

Kollywood: ట్రాన్స్ జెండర్ గా మారిన స్టార్ హీరో.. ఇదెక్కడి విడ్డూరం భయ్యా..!

Kollywood: ట్రాన్స్ జెండర్ గా మారిన స్టార్ హీరో.. ఇదెక్కడి విడ్డూరం భయ్యా..!

Kollywood:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే ఆ పాత్ర చేయాల్సిందే. కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందే అన్ని ఆచితూచి అడుగులు వేస్తారు హీరోలు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక హీరో ఏకంగా ట్రాన్స్ జెండర్ గా మారబోతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాస్, యాక్షన్ పర్ఫామెన్స్ తో లవర్ బాయ్ గా కూడా పేరు సొంతం చేసుకున్న ఈ హీరో.. ఇప్పుడు ట్రాన్స్ జెండర్ గా మారడం ఏంటి? అని అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆయన ఈ పాత్రలో నటిస్తే అభిమానులు స్వీకరిస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ట్రాన్స్ జెండర్ గా మారడం వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


వరుస సినిమాలతో బిజీగా మారిన హీరో శింబు..

ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు, నిర్మాత, డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి కోలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండ్ గా పేరు సొంతం చేసుకున్న టి.రాజేందర్ (T.Rajendar) వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శింబు (Simbu). ‘మన్మధ’ మూవీ తో తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకున్న ఈయన హీరోయిన్లతో లవ్ ఎఫైర్ లు , డైరెక్టర్లతో గొడవలు వంటి ఘటనలు ఈయన ఇమేజ్ను తగ్గించేసాయి. తాజాగా మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు మరోవైపు శింబు ‘STR 50’ అనే వర్కింగ్ టైటిల్ తో తన 50వ సినిమాను తెరకెక్కించనున్నారు. దీనికి ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లయ్యదితాల్’ దర్శకుడు దర్శకత్వం వహిస్తూ ఉండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.


50వ చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా..

ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా వున్న శింబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని STR 50 మూవీలో తాను ట్రాన్స్ జెండర్ పాత్ర పోషిస్తున్నాను అంటూ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ఇందులో చాలా విభిన్నమైన పాత్రలు ఉంటాయని, అందులో తాను మాత్రం ట్రాన్స్ జెండర్ పాత్రను ఎంచుకున్నాను అంటూ తెలిపారు. ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శింబు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలవగా అంచనాలు భారీగా పెంచేసింది. ఈ సినిమా తర్వాత శింబు బాలకృష్ణన్ దర్శకత్వంలో తన 49వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాతనే 50వ చిత్రం ప్రారంభం కానుంది. ఇక ఈ ట్రాన్స్ జెండర్ పాత్ర ద్వారా ఈయనలోని నట విశ్వరూపాన్ని చూడడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ట్రాన్స్ జెండర్ పాత్ర శింబు కి ఎలాంటి గుర్తింపును అందిస్తుందో చూడాలి.

ALSO READ:Actress Snigdha: నేనూ అమ్మాయినే.. జెండర్ పై కామెంట్స్.. పెళ్లిపై ఊహించని ప్రకటన..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×