Actress Snigdha: నటి స్నిగ్ధ (Snigdha).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే ఈమె ఎక్కువగా అబ్బాయి గెటప్ లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy) ఒక ప్రోగ్రాం లో ఈమెను చూసి తన సినిమాలో అవకాశం కల్పించింది. అలా నేచురల్ స్టార్ నాని (Nani ) హీరోగా ‘అలా మొదలైంది’ సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించింది స్నిగ్ధ. అలా మొదలైన ఆమె సినీ ప్రయాణం ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. చాలా సినిమాలలో కీలకపాత్రలు పోషించిన ఈమె.. తన కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది. అలాంటి ఈమె ఇప్పుడు సినిమాలు తగ్గించింది. చూడడానికి అచ్చం అబ్బాయిలా ఉండే ఈమె పెళ్లికి మాత్రం నో అంటుంది. తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా టామ్ బాయ్ లాగే ఉండాలనుకుంటున్నాను అంటూ తెలిపింది. ఇకపోతే డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే ఈమె పెళ్లి చేసుకోను అని చెప్పడం వెనక కూడా ఒక కారణం వున్నట్లు తెలుస్తోంది.
జెండర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన స్నిగ్ధ..
అసలు విషయంలోకి వెళ్తే స్నిగ్ధ పరమ శివుడి భక్తురాలు. ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతూ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా ఆమె శివమాల ధరిస్తుంది. ఈ విషయాన్ని గతంలో కూడా పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది కూడా.. గత ఇంటర్వ్యూలలో ఆమెను యాంకర్ స్నిగ్ధ అమ్మాయా? అబ్బాయా? అని ప్రశ్నించగా.. గట్టిగా సమాధానం ఇచ్చింది. నేను అమ్మాయినే.. అబ్బాయిని కాదు.. నాకు కూడా అందరి అమ్మాయిలాగే ప్రతినెల పీరియడ్స్ వస్తాయి. ప్రతినెల ప్యాడ్స్ కూడా కొంటాను. అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత యాంకర్ మాట్లాడుతూ.. మరెందుకు అబ్బాయిలా తయారవుతారు? అనే ప్రశ్నించగా.. దానికి కూడా అదిరిపోయే సమాధానం చెప్పింది. నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. షర్ట్ , ప్యాంట్ వేసుకుంటేనే నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను అంటూ సమాధానం తెలిపింది.
అందుకే పెళ్లి చేసుకోను – స్నిగ్ధ
ఇక 43 ఏళ్లు వచ్చినా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నిస్తే.. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచన లేదు. నా జీవితంలో ఆ సందర్భం కూడా రాలేదు. పెళ్లి చేసుకుంటే మనం ఒకరి కంట్రోల్ లోకి వెళ్లిపోతాము. అలా ఉండడం నాకు నచ్చదు. అందుకే నాకు పెళ్లి పై మంచి ఆలోచన కూడా లేదు అంటూ తెలిపింది. మొత్తానికైతే ఇన్ని రోజులు అబ్బాయి అనుకున్న కొంతమందికి తాను అబ్బాయిని కాదు అమ్మాయినే అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్నిగ్ధ.. పెళ్లి చేసుకుంటే ఇంకొకరి కంట్రోల్ లోకి వెళ్లిపోవాలి స్వేచ్ఛ పోతుంది అని ఆలోచించి పెళ్లికి దూరంగా ఉంటున్నానని తెలిపింది. మొత్తానికైతే స్నిగ్ధ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకవేళ మనసుకు నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. స్నిగ్ధ మాటలు వింటుంటే మాత్రం అది జరిగేలా లేదు అనిపిస్తోంది. మరి చూద్దాం భవిష్యత్తులో స్నిగ్ధ ప్రయాణం ఎలా సాగుతుందో. ఇకపోతే మరి కొంతమంది అభిమానులు మాత్రం మళ్లీ సినిమాలలో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు.
ALSO READ:Priyanka Chopra: ఏంటీ.. 25ఏళ్ల క్రితమే ప్రియాంక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసిందా.. ఏ సినిమానో తెలుసా..?