BigTV English

AP Politics: జగన్ మైండ్‌గేమ్ సక్సెస్ అవుతుందా?

AP Politics: జగన్ మైండ్‌గేమ్ సక్సెస్ అవుతుందా?

AP Politics: నెల్లూరు జిల్లాలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఇటీవల ఓ సమావేశంలో వ్యక్తిగత అభిప్రాయంగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా 20 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఉండాలి అంటూ చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమైనా ఉందా?.. వైసిపి మైండ్‌గేమ్‌లో భాగం ఆయన ఆ కామెంట్స్ చేశారా?
మైండ్‌గేమ్ మొదలెట్టారా?


వైసీపీ ఓటమికి కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేతలు

ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత సైలెంట్ అయిన వైసీపీ నేతలు.. క్రమంగా నోరు విప్పుతున్నారు. గతంలో తాము చేసిన తప్పిదాలు, పార్టీ చేసిన తప్పిదాలు, వాటి కారణంగా ఎదురైన ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మనం తప్పు చేశాం 2024లో బీజేపీతో కలిసి ఉండవలసింది.. ఆ పార్టీకి దూరమై నష్టపోయామని హాట్ కామెంట్స్ చేశారు. గత ఐదేళ్లూ పార్లమెంట్‌లో లోక్ సభ, రాజ్యసభల్లో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకూ తమ పార్టీ మద్దతు ఇచ్చినట్లు ప్రసన్న వెల్లడించారు. ఎలక్షన్ ముందు బీజేపీని దూరం చేసుకుని జగన్ అతిపెద్ద తప్పిదాన్ని చేశారని ప్రసన్న చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో చేరి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది.


ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ పరిస్థితి

ఒకవేళ బిజెపికి వెళ్తే ఏపీలో బిజెపి పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. పార్టీ మారి కోవూరులో బిజెపి తరఫున ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తే.. గెలిచే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో బీజేపీకి ఏ నియోజకవర్గంలోనూ పట్టు లేదు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి.. బీజేపీలోకి వెళ్తారనేది అనుమానమే. ఇక టిడిపిలోకి వెళ్తారా అంటే.. అక్కడ కూడా ప్రసన్నకు రానిచ్చే పరిస్థితి లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఆయన చంద్రబాబుపై పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ఇటీవల పార్టీ ఓటమికి కారణాలపై మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబుపై పరుష పదజాలం విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బలం పెంచుకుంటున్నారు. కాబట్టి టిడిపిలోకి వెళ్లే ఛాన్స్ లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ముందున్నా, సంక్షేమ పథకాల అమలులో జాప్యంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందని మాజీ సీఎం జగన్ భావిస్తున్నా రేమో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మోడీ, అమిత్ షాలకు బాబు అంటే సదాభిప్రాయం లేదంటున్న ప్రసన్న

మోడీ, అమిత్ షా లకు దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతోనే నల్లపురెడ్డి తో జగన్ ఈ వ్యాఖ్యలు చేయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు గతంలో అమిత్ షా తిరుమలకు వస్తే చంద్రబాబు రాళ్లు, చెప్పులు వేయించారని నల్లపురెడ్డి ఆరోపిస్తున్నారు. అలాగే గుజరాత్ లో మోడీ సీఎంగా ఉండగా ఆయన్ను హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు చెప్పిన విషయం కూడా గుర్తుచేశారు. ఇన్ని చేసిన చంద్రబాబు అంటే మోడీ, అమిత్ షాలకు సదాభిప్రాయం లేదని నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ నుంచి టీడీపీని దూరం చేసే వ్యూహంలో భాగమే అటున్నారు. ఎన్డీఏకి వైసీపీని దగ్గర చేయాలనే ఆలోచనతో మైండ్ గేమ్ ఆడుతున్నారన్న చర్చ సాగుతోంది.

Also Read: సాయి రెడ్డిపై కామెంట్స్.. జగన్‌కు తారకరత్న భార్య కౌంటర్?

నల్లపురెడ్డి కామెంట్స్ పై స్పందించని జగన్

ప్రసన్నకుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి రోజులు గడిచిపోతున్నా ఇప్పటివరకు జగన్ దానిపై స్పందించలేదు. సాధారణంగా వైసీపీలో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ పెద్దల నుంచి స్పందన కానీ.. ఖండించడం కానీ జరుగుతుంది. కానీ ఇవేమీ జరగలేదంటే.. దీని వెనుక మైండ్ గేమ్ ఉన్నట్లే అంటున్నారు. వచ్చే ఎన్నికల లోపు తెలుగుదేశం పార్టీని .. బీజేపీకి దూరం చేయడమే లక్ష్యంగా ఈ మైండ్ గేమ్ వైసీపీ నాయకులు స్టార్ట్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం అవినీతి మరకలున్న వైసీపీతో కలిసి వెళ్లే ప్రసక్తే ఉండదని విశ్లేషకులు అంటున్నారు. మరి వేచి చూడాలి నల్లపురెడ్డి వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు జగన్‌ల రియాక్షన్ ఎలా ఉంటుందో.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×