BigTV English

Janaka Aithe Ganaka Trailer: కండోమ్ పనిచేయలేదని కోర్టుకెక్కిన హీరో..

Janaka Aithe Ganaka Trailer: కండోమ్ పనిచేయలేదని కోర్టుకెక్కిన హీరో..

Janaka Aithe Ganaka Trailer: ట్యాలెంటెడ్ హీరో సుహాస్, సంగీర్తన జంటగా సందీప్ బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జనక అయితే గనుక. దిల్ రాజు  నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.


ఒక మిడిల్ క్లాస్ యువకుడు పెళ్లి తరువాత పిల్లలను కనడానికి ఎందుకు భయపడుతున్నాడు అనేది సినిమా కథ.  ఇందులో సుహాస్ ఒక వాషింగ్ మెషిన్ రిపేర్ చేసే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి చిన్న వయస్సులోనే పెళ్లి అవుతుంది. కానీ, పిల్లలను మాత్రం వద్దు అంటాడు.  ఇరు కుటుంబ పెద్దలతో పాటు బయటివారు కూడా పిల్లలు.. పిల్లలు అని గోల పెడుతుంటారు.

వచ్చే జీతం ఇంట్లోకే  సరిపోవడం లేదు.. మళ్లీ ఇప్పుడు పిల్లలు అంటే.. వారి చదువుల కోసం కోట్లు  ఖర్చు అవుతాయి. అవి తన దగ్గర లేదు కాబట్టి పిల్లలు వద్దు అంటూ చెప్పుకొస్తాడు. కానీ, చివరకు సుహాస్ భార్య  ప్రెగ్నెంట్ అవుతుంది. దీంతో షాక్ కు గురైన సుహాస్.. కండోమ్ వాడినా కూడా తన భార్య ప్రెగ్నెంట్ ఎలా అయ్యిందో తెలియక సతమతమవుతూ ఒక నిర్ణయానికి వస్తాడు.


కండోమ్  పనిచేయలేదని, ఆ కండోమ్ కంపెనీ మీద  కోర్టులో కేసు వేస్తాడు. ఈ విచిత్రమైన కేసు ఎక్కడి వరకు వెళ్లి ఆగింది.. ? చివరికి ఈ కేసులో గెలిచాడా..? లేదా.. ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ట్రైలర్ ను బట్టి అవుట్ అండ్ అవుట్ కామెడీ  ఎంటర్ టైనర్ గా కనిపిస్తుంది.

నిజంగా ఈ సినిమా కాన్సెప్ట్ ను వినోదాత్మకంగా చూపించినా.. ఆలోచించ దగ్గ సీరియస్ ఉన్న కంటెంట్ అని చెప్పాలి.  ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి వచ్చే జీతం, ఇల్లు నడిపే  విధానం, పెరుగుతన్న ధరల మధ్య  పిల్లలను పోషించడం అనేది ఎంతో బరువుతో కూడుకున్న పని.  ఇక ఈ సినిమా అలాంటి తండ్రులకు బాగా కనెక్ట్  అవుతుందనే చెప్పాలి. మరి  ఈ సినిమాతో సుహాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×