BigTV English
Advertisement

Suriya: 70 కోట్లతో లగ్జరీ ఫ్లాట్.. ముంబైకి హీరో సూర్య షిఫ్ట్?

Suriya: 70 కోట్లతో లగ్జరీ ఫ్లాట్.. ముంబైకి హీరో సూర్య షిఫ్ట్?

Suriya: హీరో సూర్య. కోలివుడ్ స్టార్. టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్. త్వరలోనే పాన్ ఇండియా ఎంట్రీకి రెడీ అవుతున్నారు. తన మార్కెట్ పెంచుకోవడానికి ముంబైకి షిఫ్ట్ కావాలని ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే తగ్గట్టే లేటెస్ట్‌గా ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొన్నాడు సూర్య.


ఫ్లాట్ అంటే ఎంత ఉంటుంది? హైదరాబాద్‌లో కాస్త ఖరీదైన ఫ్లాట్ అంటే 2 నుంచి 4 కోట్లు పలుకుతుంది. లగ్జరీ విల్లా అయితే 10 కోట్లకే వచ్చేస్తుంది. అదే, ముంబైలో అయితే మరింత కాస్ట్లీ. అందులోనూ బాలీవుడ్ స్టార్స్, పొలిటికల్ బిగ్ లీడర్స్ ఉండే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ అంటే మాటలా?

70 కోట్లు పెట్టి ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారట హీరో సూర్య. సుమారు 9వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలంగా ఉంటుందట ఆ ఫ్లాట్. భారీ బాల్కనీలు, గార్డెన్ స్పేస్, విశాలమైన బెడ్ రూమ్స్, బిగ్ హాల్.. ఇలా ఆ ఫ్లాట్ ఓ రాజభవనంలా ఉంటుందని అంటున్నారు.


హీరో సూర్య కొనుగోలు చేసిన ఫ్లాట్ ధర 68 కోట్లని.. రిజిష్ట్రేషన్, ఇతర ఖర్చులకు మరో 2 కోట్లు అయ్యాయని.. మొత్తంగా 70 కోట్లతో ముంబైలో లగ్జరీ ఫ్లాట్ సూర్య సొంతం చేసుకున్నాడు.

ఫ్లాట్ కొన్నాడంటే.. సూర్య ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా? అనే అనుమానం వస్తోంది. త్వరలోనే చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అవ్వాలని సూర్య- జ్యోతిక దంపతులు భావిస్తున్నారని ప్రచారం నడుస్తోంది. అయితే, సూర్య ఫ్యామిలీ చెన్నైలోనే ఉంటుందని.. ముంబైలో కొన్న ఫ్లాట్‌ను కేవలం గెస్ట్ హౌజ్‌గా మాత్రమే వాడుకుంటారని చెబుతున్నారు. 70 కోట్లతో ఫ్లాట్ కొని.. అప్పుడప్పుడూ వచ్చిపోయే గెస్ట్ హౌజ్‌గా వాడటం.. సూర్య రేంజ్‌కి తగ్గట్టుగానే ఉందంటున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం సూర్య.. శివ దర్శకత్వంలో వీర్‌ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ మూవీ చేయనున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×